ముంబై : దేశవాళీ సీజన్‌కు ముందు ముంబై క్రికెట్ జట్టుకు ఓ కుదుపు! తన నాయకత్వ శైలితో ముంబైని రంజీ విజేతగా నిలుపడంతో పలు టైటిళ్లు అందించిన వెటరన్ క్రికెటర్ అజింక్యా రహానే కెప్టెన్సీ బాధ్యతల నుంచి అనూహ్యంగా తప్పుకున్నాడు. ఈ విషయాన్ని గురువారం ఎక్స్ ద్వారా వెల్లడించాడు. ‘ముంబై జట్టుకి నాయకత్వం వహించడం, మ్యాచ్‌లు గెలిపించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.
దేశవాళీ సీజన్ సమీపిస్తున్న వేళ..ముంబైకి మరో కొత్త కెప్టెన్ తీర్చిదిద్దేందుకు ఇదే సరైన సమయమని భావించాను. అందుకే కెప్టెన్సీ బాధ్యతల్లో కొనసాగవద్దని నిర్ణయించుకున్నాను. ముంబై మరిన్ని టైటిళ్లు గెలువడంలో కీలకంగా వ్యవహరిస్తాను’ అని రహానే పేర్కొన్నాడు.