AIFF : ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వాలిఫయర్స్‌లో టీమిండియా వైఫల్యానికి హెడ్‌కోచ్ మూల్యం చెల్లించుకున్నాడు. బ్లూ టైగర్స్ ఓటమితో అగ్రహంగా ఉన్న ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య(AIFF) సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఐదేండ్లుగా హెడ్‌కోచ్‌గా సేవలందిస్తున్న ఇగొర్ స్టిమాక్(Igor Stimac) పై వేటు వేసింది. ఏఐఎఫ్ఎఫ్ ఉపాధ్యక్షుడు ఎన్ఏ హ్యారిస్(NA Haris) అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్టిమాక్‌ను బాధ్యతల నుంచి తప్పించాలనే నే నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే కొత్త కోచ్‌ను నియమిస్తామని హ్యారిస్ వెల్లడించారు.
‘వరల్డ్ కప్ 2026 క్వాలిఫయర్స్‌లో భారత సీనియర్ పురుషుల జట్టు ప్రదర్శన నిరాశపరిచింది. దాంతో, టీమ్‌ను గెలుపు బాట పట్టించేందుకు కొత్త కోచ్ అవసరమని సభ్యులందరూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. స్టిమాక్ పదవీకాలం ముగిసిందని ఉత్తర్వులు జారీ చేశాం. ఇన్ని రోజులు భారత జట్టుకు సేవలందించిన స్టిమాక్‌కు ధన్యవాదాలు. అతడి భవిష్యత్‌లో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాం” అని హ్యారిస్ తెలిపాడు.
స్టిమాక్ ఆధ్వర్యంలో భారత జట్టు 53 మ్యాచ్‌లు ఆడగా కేవలం 19 విజయాలు మాత్రమే సాధించింది. అయితే.. ఈ ఏడాది ఏఎఫ్సీ ఆసియా కప్(AFC Asia Cup)లో టీమిండియా మూడింటా పరాజయం పాలైంది. అంతేకాదు ఏకంగా ఆరు గోల్స్ సమర్పించుకొని కనీసం ఒక్కటంటే ఒక్క గోల్ కూడా చేయలేదు. అయినా సరే ఆలిండియా ఫుట్‌బల్ సమాఖ్య స్టిమాక్‌పై నమ్మకం ఉంచింది. కానీ, ఫిఫా క్వాలిఫయర్‌లో మళ్లీ చెత్త ప్రదర్శన కనబరచడంతో అతడిని హెడ్‌కోచ్‌గా తొలగించాలనే డిమాండ్లు వినిపించాయి. ఇప్పటికే స్టార్ ఆటగాడు సునీల్ ఛెత్రీ వీడ్కోలు పలికాడు. ఇప్పుడు హెడ్‌కోచ్ స్టిమాక్ వైదొలగనున్నాడు. ఈ పరిస్థితుల్లో భారత ఫుట్‌బాల్ భవితను కొత్త కోచ్ సామర్థ్యంపై ఆధారపడి ఉంది.