IPL 2024 – MS Dhoni | భారత క్రికెట్ దిగ్గజం, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోని చెన్నైలో ల్యాండ్ అయ్యాడు. మరో మూడు వారాలలో మొదలుకాబోయే ఐపీఎల్-17 కోసం అతడు చెన్నై చేరుకున్నాడు. ఐపీఎల్ – 2024 నేపథ్యంలో సీఎస్కే ఇటీవలే ప్రాక్టీస్ క్యాంప్‌ను ఏర్పాటుచేసింది. పలువురు స్టార్ ప్లేయర్లు ఇప్పటికే అక్కడకు చేరుకోగా తాజాగా ‘తాలా’ కూడా ఎంట్రీ ఇచ్చాడు. వాస్తవానికి ధోని ఇక్కడకు మార్చి 1 నే రావాల్సి ఉండగా జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరవడంతో నాలుగు రోజులు ఆలస్యంగా వచ్చాడు.
ధోని చెన్నైలో ల్యాండ్ అయిన విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ట్విటర్ (ఎక్స్) ఖాతాలో వెల్లడించింది. ధోని ప్రాక్టీస్ క్యాంప్‌కు వస్తున్న ఫోటోలను షేర్ చేస్తూ ‘తాలా దర్శనమ్’ అని క్యాప్షన్ ఇచ్చింది. సీఎస్కే ఈ ఫోటో షేర్ చేసిన కొద్దిసేపట్లోనే ఇది వైరల్ అయింది. హెలికాప్టర్ షాట్‌కు పేటెంట్ హక్కులు కలిగి ఉన్న ధోనిని.. ‘హెలికాప్టర్ ల్యాండెడ్ ఇన్ చెన్నై’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
#THA7A Dharisanam! 🦁💛#DenComing pic.twitter.com/dJbdsDd6wf
— Chennai Super Kings (@ChennaiIPL) March 5, 2024
సోమవారం ధోని తన ఫేస్బుక్ ఖాతాలో ‘కొత్త సీజన్లో న్యూ రోల్ కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నా..’ అని పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కొత్త రోల్ ఏంటా..? అని ఫ్యాన్స్ అంతా ఎవరికి నచ్చింది వారు ఊహించుకుంటుండగా తాజాగా ధోని.. ప్రాక్టీస్ క్యాంప్‌లోకి వచ్చేశాడు. ధోని కంటే ముందే దీపక్ చాహర్, రుతురాజ్ గైక్వాడ్, సిమర్జిత్ సింగ్, రాజ్యవర్ధన్ హంగర్గేకర్, ముకేశ్ చౌదరి, ప్రశాంత్ సోలంకి, అజయ్ మండల్, షేక్ రషీద్, నిషాంత్ సింగ్‌లు చెన్నై ఏర్పాటుచేసిన ప్రాక్టీస్ క్యాంప్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. గత సీజన్లో కూడా ధోని ఆధ్వర్యంలో ట్రైనింగ్ క్యాంప్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగబోతున్న సీఎస్కే.. తొలి మ్యాచ్‌లో మార్చి 22న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.
Here’s the Thala MS Dhoni entry video 💛
Russ touched his feet 🥹
pic.twitter.com/ij1Crb2YAt— ` (@WorshipDhoni) March 5, 2024