టోక్యో: ఆమె ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు.. ఏకంగా 10సార్లు ఒలింపిక్ మెడల్స్ గెలిచింది. టోక్యోలో ఒలింపిక్స్ జరగబోతున్న సందర్భంలోనే ఆమె తన 100వ పుట్టిన రోజు జరుపుకుంది. ఈమె ఇప్పటికీ జీవించి ఉన్న ఓల్డెస్ట్ ఒలింపిక్ చాంపియన్‌గా రికార్డు సృష్టించింది. హంగరీకి చెందిన ఈ జిమ్నాస్ట్ పేరు ఆగ్నెస్ కెలెటి.
ఏంటీ ఈమె బ్యాక్‌గ్రౌండ్?
1921 జనవరి 9న ఈమె హంగరీ రాజధాని బుడాపెస్ట్‌లో జన్మించింది. 16 ఏళ్ల వయసులో తొలిసారి నేషనల్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత ఈ ఘనతను 9 సార్లు అందుకుంది. ఇక ఒలింపిక్స్‌లో ఐదుసార్లు జిమ్నాస్టిక్స్ గోల్డ్ మెడల్ గెలవడం విశేషం. ఈ ఏడాది జనవరిలో 100వ పుట్టిన రోజు జరుపుకున్న ఆగ్నెస్కు ఐఓసీ ప్రెసిడెంట్ థామస్ బాక్ శుభాకాంక్షలు తెలిపారు.
హిట్లర్ నుంచి తప్పించుకొని..
ఆగ్నెస్ ఓ యూద మతస్థురాలు. 1940లో టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె పాల్గొనడానికి సిద్ధమైనా రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఆ గేమ్స్ రద్దయ్యాయి. అదే సమయంలో హంగరీ దేశం హిట్లర్ నేతృత్వంలోని నాజీల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో తనను తాను ప్రాణాలతో రక్షించుకోవడానికి ఓ క్రిస్టియన్ అమ్మాయిగా చెప్పుకుంది ఆగ్నెస్. అప్పట్లో యూదులంతా పసుపు రంగు స్టార్ ధరించాల్సి ఉండేది. కానీ నేను మాత్రం అలా చేయలేదు. తప్పుడు పత్రాలతో ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని ఓ మారుమూల గ్రామంలోకి వెళ్లి తలదాచుకున్నాను అని ఆగ్నెస్ చెప్పింది.
రెండో ప్రపంచ యుద్ధం నుంచి ఆగ్నెస్ కెలెటి ఎలాగోలా ప్రాణాలతో బయటపడినా.. ఆమె తండ్రితోపాటు ఇతర కుటుంబ సభ్యులు చాలా మంది చనిపోయారు. మొత్తంగా హంగరీలోని ఐదున్నర లక్షల మంది యూదులను నాజీలు ఊచకోత కోశారు. యుద్ధం ముగిసిన తర్వాత 1948 లండన్ ఒలింపిక్స్‌లో పాల్గొనాల్సి ఉన్నా.. గాయం కారణంగా దూరమైంది. మొత్తానికి 31 ఏళ్ల వయసులో 1952 ఒలింపిక్స్‌లో ఆమె తొలిసారి పాల్గొంది. ఆ ఒలింపిక్స్‌లో తన కంటే ఎంతో చిన్నవాళ్లయిన జిమ్నాస్ట్స్ను వెనక్కి నెట్టి గోల్డ్ సహా మొత్తంగా నాలుగు మెడల్స్ గెలిచింది. ఇక తర్వాత మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో ఆమె మరింత చెలరేగింది. నాలుగు గోల్డ్ సహా మొత్తం ఆరు మెడల్స్ గెలిచింది.
At age 100, Agnes Keleti is the oldest living Olympic Champion. In her century, what did Agnes see?
— Olympics (@Olympics) July 15, 2021
She saw…#StrongerTogether @skyandocean_ #Tokyo2020 pic.twitter.com/ajejhex8R1