IND Vs SA | దక్షిణాఫ్రికాతో కోల్‌కతా వేదిక జరిగిన టెస్టులో భారత జట్టు ఘోర పరాజయం పాలైంది. టీమిండియా బ్యాట్స్‌మెన్ స్పిన్ ఆడడంలో ఉన్న బలహీనతను మరోసారి బయటపెట్టింది. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్మెంట్ టర్నింగ్ పిచ్ కావాలని కోరుకుంది. కానీ, ఆ నిర్ణయే టీమిండియాకు శాపంగా మారింది. టర్నింగ్ పిచ్‌తో ప్రయోజనం పొందాలని ఆశించిన భారత బ్యాట్స్‌మెన్ దక్షిణాఫ్రికా స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బందిపడ్డారు. ఈ క్రమంలో మాజీ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ భారత బ్యాట్స్‌మెన్ స్పిన్ ఆడడంలో అత్యుత్తమం కాదని పేర్కొన్నారు. చాలా పాశ్చాత్య ఆటగాళ్లు వారి కంటే మెరుగ్గా ఉన్నారని వ్యాఖ్యానించారు. అశ్విన్ మాట్లాడుతూ ‘ప్రస్తుతం మనం స్పిన్‌లో అత్యుత్తమ ప్లేయర్లం కాదు. చాలా పాశ్చాత్య జట్లు మనకంటే మెరుగ్గా ఉన్నాయి. ఎందుకంటే వారు భారత్‌కు వచ్చి స్పిన్‌ను ప్రాక్టీస్ చేస్తున్నారు. మేం అంతగా సిద్ధం కాము’ అంటూ వ్యాఖ్యానించాడు. భారత ఆటగాళ్లు ఫాస్ట్ బౌలింగ్‌ను అద్భుతంగా ఆడతారని అశ్విన్ తెలిపాడు. ఎందుకంటే దాన్ని సవాల్‌గా భావిస్తారని.. కానీ, స్పిన్‌కు అదే విధానాన్ని అవలంభిస్తున్నట్లుగా కనిపించడం లేదని తెలిపాడు.
అలాగే, లెండజరీ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ సైతం ఓటమిపై స్పందించారు. భారత ఆటగాళ్లకు స్పిన్ బలహీనతకు ప్రధాన కారణం డొమెస్టిక్ క్రికెట్‌కు దూరంగా ఉండడమేనన్నారు. ఆటగాళ్లు దేశీయ క్రికెట్ ఆడరని.. రంజీలు ఆడితే అలాంటి పిచ్‌లపై ఆడటం అలవాటవుతుంది. దేశీయ క్రికెట్ జట్లు సైతం టర్నింగ్ పిచ్‌లను సిద్ధం చేస్తాయని.. కానీ, మన ఆటగాళ్లలో ఎంత మంది రంజీలు ఆడుతున్నారు అంటూ ఆయన ప్రశ్నించారు. ప్లేయర్లు దేశీయ సర్క్యూట్‌కు దూరంగా ఉన్నప్పుడు, టర్నింగ్ పిచ్‌లపై ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. వర్క్లోడ్పై గవాస్కర్ విమర్శలు గుప్పించారు. చాలామంది ఆటగాళ్లు తమ ఫామ్ కోల్పోయిన సమయంలో మాత్రమే రంజీలు ఆడుతున్నారని.. మిగతా సమయంలో ‘పనిభారం’ పేరుతో దూరంగా ఉంటారన్నారు. స్పిన్ పిచ్‌లపై ఆడాల్సి వస్తే.. దేశీయ క్రికెట్ కంటే మెరుగైంది మరొకటి లేదని గవాస్కర్ స్పష్టం చేశారు. టీమ్ ఇండియాకు స్పిన్ పిచ్‌లపై ఆడగల నమ్మకమైన బ్యాట్స్‌మెన్ అవసరమైతే.. సెలెక్టర్లు దేశీయ క్రికెట్ ఆడే ఆటగాళ్లపై ఎక్కువ శ్రద్ధ వహించాలన్నారు.