Zimbabwe | బులవాయొ : టెస్టులలో జింబాబ్వే రికార్డు స్కోరు సాధించింది. అఫ్గానిస్థాన్‌తో బులవాయొలో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 586 పరుగులు చేసింది. టెస్టులలో జింబాబ్వేకు ఇదే అత్యుత్తమ స్కోరు (అంతకుముందు వెస్టిండీస్‌తో 563/9). జింబాబ్వే బ్యాటర్లలో సీన్ విలియమ్స్ (154), బ్రియాన్ బెన్నెట్ (110), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (104) శతకాలతో మెరవగా బెన్ కరన్ (68) రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన అఫ్గాన్.. 30 ఓవర్లలో 95/2 పరుగులు చేసింది.