Aaryavir Sehwag | షిల్లాంగ్: భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్ కూచ్ బెహార్ ట్రోఫీలో దుమ్మురేపాడు. మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ అండర్-19 తరఫున బరిలోకి దిగిన ఆర్యవీర్ అజేయ డబుల్ సెంచరీ(229 బంతుల్లో 200 నాటౌట్)తో విజృంభించాడు.
సెహ్వాగ్‌ను తలపిస్తూ మేఘాలయ బౌలర్లను ఊచకోత కోశాడు. 34 ఫోర్లు, రెండు భారీ సిక్స్‌లతో కదంతొక్కాడు.