Aaron Finch | టీ20 లీగ్‌కు వీడ్కోలు.. పొట్టి క్రికెట్ నుంచి వైదొలుగుతాడా..?
Aaron Finch : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అరోన్ ఫించ్(Aaron Finch) అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. రెండేండ్ల క్రితంవన్డేలకు వీడ్కోలు పలికిన ఫించ్.. తాజాగా టీ20 లీగ్స్‌కు కూడా గుడ్ బై చెప్పేశాడు. మెల్బోర్న్ రెనెగేడ్స్(Melbourne Renegrades) జట్టు...
Aaron Finch : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అరోన్ ఫించ్(Aaron Finch) అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. రెండేండ్ల క్రితంవన్డేలకు వీడ్కోలు పలికిన ఫించ్.. తాజాగా టీ20 లీగ్స్‌కు కూడా గుడ్ బై చెప్పేశాడు. మెల్బోర్న్ రెనెగేడ్స్(Melbourne Renegrades) జట్టు సారథిగా ఉన్న ఫించ్ హొబర్ట్ హరికేన్స్(Hobart Hurricanes) జట్టుతో మ్యాచ్‌కు ముందు రోజు అతడు బిగ్‌బాష్ లీగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఈ సందర్భంగా ఈ డాషింగ్ ఓపెనర్ ఫ్యాన్స్, జట్టు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపాడు. ‘ఇన్నేండ్ల నా ప్రయాణంలో వెన్నంటి ఉన్న కుటుంబ సభ్యులు, అభిమానులు, జట్టు సభ్యులకు ధన్యవాదాలు అని ఫించ్ అన్నాడు. అయితే.. బిగ్‌బాష్ లీగ్ చాంపియన్‌గా అవతరించడం కంటే గొప్ప ఫీలింగ్ ఏదీ లేదు. నాకు ఆ టైటిల్ చాలా స్పెషల్. రెనెగేడ్స్ జట్టుకు నా జీవితంలో చాలా ప్రాధాన్యం ఉంది. ఇన్ని రోజులు నాకు సమకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’ అని ఫించ్ వెల్లడించాడు.
What a player he’s been 🙌
Aaron Finch has announced his retirement. #BBL13 pic.twitter.com/PPpqr7yYzM
— KFC Big Bash League (@BBL) January 4, 2024
రెనెగ్రేడ్స్ జట్టుకు ఫించ్ రికార్డు స్థాయిలో 11 సీజన్లు సారథిగా వ్యవహరిచాడు. అంతేకాదు ఈ లీగ్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన, ఎక్కువ రన్స్ కొట్టిన రెండో క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఫించ్ 106 మ్యాచుల్లో 3,311 పరుగులు సాధించాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు బాదిన క్రికెటర్ క్రిస్ లిన్. ఈ విధ్వంసక బ్యాటర్ 3,638 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
అరోన్ ఫించ్

ఆస్ట్రేలియా గొప్ప బ్యాటర్లలో ఒకడైన ఫించ్.. వన్డేలు, టీ20ల్లో సారథ్యం వహించాడు. అతడి కెప్టెన్సీలో కంగారూ జట్టు 2021లో పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడింది. అయితే.. ఫామ్ లేమి కారణంగా అతడు 2022లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆసీస్ తరఫున 146 వన్డేలు, 103 టీ20లు ఆడిన ఫించ్.. 131 మ్యాచుల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఇవి కూడా చదవండి
- Bheema Movie | గోపీచంద్ ‘భీమా’ టీజర్ టైం ఫిక్స్.. ఎప్పుడంటే.?
- Minister Ponnam Prabhakar | ఆందోళన వద్దు ఉచిత విద్యుత్ పథకం కొనసాగుతుంది : మంత్రి పొన్నం
- David Warner: వార్నర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రిటైర్ అయ్యాక అలా అలరించబోతున్న ఢిల్లీ కెప్టెన్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

