సెమీస్‌లో దక్షిణాఫ్రికా చిత్తు
క్రైస్ట్‌చర్చ్: డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ 137 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. బ్యాటింగ్‌లో డానీ వ్యాట్ (129; 12 ఫోర్లు), బౌలింగ్‌లో ఎకెల్‌స్టోన్ (6/36) ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లిష్ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 38 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ తలపడనుంది.