న్యూఢిల్లీ: భారత గ్రాండ్‌మాస్టర్ ఇనియాన్.. లా నూసియా ఓపెన్ చెస్ టోర్నమెంట్ టైటిల్ చేజిక్కించుకున్నాడు. స్పెయిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో 19 ఏండ్ల ఇనియాన్ తొమ్మిది రౌండ్లలో అజేయంగా నిలిచాడు. ఆరు గేమ్‌లలో విజయం సాధించిన ఇనియాన్ మరో రెండింటిని ‘టై’ చేసుకున్నాడు. ఓ రౌండ్లో ఇనియాన్కు బై లభించింది. ఆఖరిదైన తొమ్మిదో రౌండ్లో సోమవారం క్యూబాకు చెందిన విల్సన్ లియాన్‌పై విజయం సాధించడంతో ఇనియాన్కు టైటిల్ ఖాయమైంది.