శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 05, 2020 , 00:58:27

గ్రామ పరిశుభ్రత అందరి బాధ్యత

 గ్రామ పరిశుభ్రత అందరి బాధ్యత

నర్సాపూర్‌ రూరల్‌: గ్రామ పరిశుభ్రత అందరి బాధ్యతగా స్వీకరించాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని గూడెంగడ్డ గ్రామంలో నూతనంగా నిర్మించిన సెగ్రిగేషన్‌ షెడ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటి నుంచే తడి, పొడి చెత్తను వేరుచేసి చెత్తను సేకరించే పంచాయతీ వాహనంలో వేయాలన్నారు.  ఆరు బయట ఎక్కపడితే అక్కడ చెత్తను వేయకుండా చెత్త బుట్టలను వాడాలని పేర్కొన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంటేనే రోగాలు దరిచేరవన్నారు. సర్పంచ్‌ నర్సింహులు, ఆత్మ కమిటీ చైర్మన్‌ శివకుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌, కౌన్సిలర్‌ అశోక్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. 


logo