మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Apr 06, 2020 , 23:07:12

దాతలే దైవం

దాతలే దైవం

  • నిత్యావసర వస్తువుల పంపిణీతో చేయూత
  • ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా ముందుకొచ్చిన దాతలు

ఉమ్మడి మెదక్‌ జిల్లా నెట్‌వర్క్‌ : లాక్‌డౌన్‌ సందర్భంగా పేదలు, వలస కూలీలు ఇబ్బందులు పడకూడదన్న సదుద్దేశంతో దాతలు ముందుకొచ్చి అపన్నహస్తం అందిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ను పంపిణీ చేస్తుండటంతో తమ పాలిట దాతలే దైవంలా ఆదు కుంటున్నారని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోమవా రం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో సర్పంచ్‌ ప్రకాశ్‌చారి, సోలక్‌ పల్లిలో  సర్పంచ్‌ శ్రీకాంత్‌రెడ్డి, గుమ్మడిదల మండలం అన్నారంలో టీఆర్‌ఎస్‌ మండల యువత అధ్యక్షుడు నరహరి, బొంతపల్లిలో సర్పంచ్‌ నవీనాశ్రీనివాస్‌రెడ్డి వలస కూలీలకు నిత్యావసర సరుకు లు, బియ్యంతోపాటు రూ.500 ఆర్థిక సాయాన్ని అందజేశారు. బొ ల్లారం మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్‌ చంద్రారెడ్డి, వెంటక్‌రెడ్డి నగర్‌లో వీవీఆర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు వరప్రసాద్‌రెడ్డి, బొ ల్లారం మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ అనిల్‌ కుమార్‌రెడ్డిలు ఆటో డ్రై వర్లకు, పేదలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. హత్నూర మండలం కొడిపాక సర్పంచ్‌ మాధవి బాబుయాదవ్‌, మాధుర గ్రామంలో కోలన్వ్రి, నాగప్రభుగౌడ్‌, ఎస్‌ఐ శ్రీనివాస్‌లు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయ లను పంపిణీ చేశారు. నారాయణఖేడ్‌ అటవీ శాఖ రేంజ్‌ అధికారి దేవిలాల్‌ పేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. సిర్గాపూర్‌ లో ఎంబీఆర్‌ యువసేన ఆధ్వర్యంలో, సంగారెడ్డి పట్టణంలోని మ గ్దుంనగర్‌లో కౌన్సిలర్‌ షేక్‌ షఫీలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తూప్రాన్‌లో మున్సిపల్‌ చైర్మన్‌ రాఘవేందర్‌గౌడ్‌తో కలిసి రాష్ట్ర ఫారెస్ట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆటో డ్రైవర్లకు  నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పెద్దశంకరంపేట మండ లం  వీరోజిపల్లిలో మన్నె కృష్ణ, ఎస్‌ఎంసీ చైర్మన్‌ నీరుడి సాయిలు కూరగాయలను పంపిణీ చేశారు. చేగుంటలో ఎంపీటీసీ వెంకటలక్ష్మి  నిరుపేదలకు కిరాణ సరుకులను అందజేశారు.చేర్యాల మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నిమ్మ రాజీవ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అంకుగారి స్వరూపరాణి, మాధన్నపేటలో  సోలిపేట సతీశ్‌రెడ్డ్డి వలస కూ లీలకు నిత్యావసర సరుకులను అందజేశారు. రాయపోల్‌ మండల కేంద్రంలో మామిడి మోహన్‌రెడ్డి కురగాయలను పంపిణీ చేశారు. దౌల్తాబాద్‌ మండలం అహ్మద్‌నగర్‌, గాజులపల్లి గ్రామాల్లో  జెడ్పీటీసీ రణం జ్యోతి,  కోహెడ మండలం నాగసముద్రాలలో కృష్ణారె డ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌ రవీందర్‌లు నిరుపేదలు, కూలీలకు కూరగాయలను పంపిణీ చేశారు. కొమురవెల్లి మండలం ఐనాపూర్‌, రాంసాగర్‌, లెనిన్‌నగర్‌లో ఆయా గ్రామాల సర్పంచులు, కొమురవెల్లిలో మాజీ సర్పంచ్‌ కిష్టయ్య, మద్దూరు మండలంలోని పలు గ్రామాల్లో  కొత్తపల్లి సతీశ్‌కుమార్‌, ఎస్‌ఐ సంపత్‌, పాశికంటి వెంకటరమణ బియ్యం, కూరగాయలతోపాటు ఆర్థిక సాయాన్ని అందజేశారు. సిద్దిపేట పట్టణానికి చెందిన రాజశేఖర్‌రెడి, సాయిరాం క్రికెట్‌ యూత్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో, సిద్దిపేట డిగ్రీ కళాశాల ఆవరణలో వైద్యులు స్వామి, భాస్కర్‌, గణేశ్‌, మహేశ్‌, భీమేశ్‌, రవీంద్ర, నరేందర్‌, గణేశ్‌, అరుణ్‌, సంతోష్‌, రిటైర్డ్‌ పోలీసు అధికారులు రత్నం, వీరారెడ్డి, ప్రభాకర్‌, విశ్వేశ్వర్‌, దయాకర్‌రెడ్డి, రవీందర్‌లు, చీకోటి మధుసూదన్‌, రత్నాకర్‌ పేదలకు, వలస కూలీలకు నిత్యావసర సరుకులతోపాటు బియ్యం అందజేశారు. సిద్దిపేట మండలం ఇర్కోడులో సుడా చైర్మన్‌ మారెడ్డి రవీందర్‌రెడ్డి  కోడిగుడ్లు, బియ్యం పంపిణీ చేశారు. మర్కూక్‌ మండలంలోని పారిశుధ్య కార్మికులకు గడా ప్రత్యేకాధికారి ముత్యం రెడ్డి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కరుణాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అందజేశారు.


logo