ప్రముఖ వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ 10 లక్షల వీడియోలను తొలగించినట్టు పేర్కొన్నది. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతున్న విషయం తెలిసిందే. అయితే.. కరోనా గురించి, కరోనా జాగ్రత్తలు, వ్యాక్సినేషన్, కరోనా లక్షణాలు.. ఇలా కరోనాకు సంబంధించిన చాలా వీడియోలు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి. కానీ.. అందులో కొన్ని వీడియోలు కోవిడ్‌కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని పొందుపరిచాయని యూట్యూబ్ గుర్తించింది.
ఫిబ్రవరి 2020 నుంచి ఇప్పటి వరకు కోవిడ్ 19 మీద అప్లోడ్ అయిన వీడియోల్లో తప్పుడు సమాచారం ఉన్న 1 మిలియన్ వీడియోలను యూట్యూబ్ తాజాగా తొలగించింది. నిజానికి.. యూట్యూబ్ ప్రతి మూడునెలలకు ఒకసారి 10 మిలియన్ వీడియోలను తొలగిస్తుందట. ఇలాంటి తప్పుడు సమాచారం ఉన్న వీడియోలు, వ్యూస్ లేని వీడియోలు, యూట్యూబ్ రూల్స్‌ను అతిక్రమించడం లాంటి కారణాలతో ప్రతి మూడు నెలలకు కోటి వీడియోలను వరకు డిలీట్ చేస్తుందట. అయితే ఈ సారి.. కేవలం కరోనాకు సంబంధించిన తప్పుడు సమాచారం ఉన్న 10 లక్షల వీడియోలను యూట్యూబ్ డిలీట్ చేసినట్టు యూట్యూబ్ చీఫ్ ప్రాడక్ట్ ఆఫీసర్ నెల్ మోహన్ తెలిపారు.
యూట్యూబ్‌లో ఉండే బిలియన్ వీడియోలలో.. బ్యాడ్ కంటెంట్, తప్పుడు సమాచారం ఉన్న వీడియోల పర్సంటెజ్ చాలా తక్కువగా ఉంటుంది. కేవలం టోటల్ వ్యూస్‌లో 16 నుంచి 18 శాతం వ్యూస్ మాత్రమే యూట్యూబ్ పాలసీలను ఉల్లంఘించే వీడియోల ద్వారా వస్తాయి.. అని ఆయన స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Koo : కోటి మంది యూజర్ల మార్క్‌కు చేరుకున్న దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘కూ’