Powerful Battery | గత కొద్ది దశాబ్దాలుగా బ్యాటరీ టెక్నాలజీ అద్భుతమైన పురోగతిని సాధించింది. మనం సోడియం-అయాన్ సెల్‌లను ఉపయోగించే పవర్ బ్యాంకులు వచ్చేశాయి. ఆధునిక బ్యాటరీలో గతంలో కంటే ఎక్కువ కాలం పని చేస్తున్నాయి. తాజాగా మరో బ్యాటరీ వచ్చేసింది. ఈ బ్యాటరీని చార్జ్ చేసే వారం కాదు.. నెల కాదు.. సంవత్సరం కాదు ఏకంగా 50 సంవత్సరాల రానున్నది. పాపులర్ మెకానిక్స్ నివేదిక పేర్కొంది. చైనీస్ బ్యాటరీ కంపెనీ బీటావోల్ట్ ఇటీవల బీవీ100 అనే నాణెం, న్యూక్లియర్ బ్యాటరీని ప్రవేశపెట్టింది. ఈ బ్యాటరీ రేడియోధార్మిక మూలకం నికెల్-63 ద్వారా శక్తిని పొందుతుంది. దాంతో ఒకేసారి ఛార్జ్ చేస్తే 50 సంవత్సరాల వస్తుంది. బీవీ100 బ్యాటరీ 100 మైక్రోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మూడు వోల్ట్ల వద్ద పని చేస్తుంది. ఈ సంవత్సరం చివరి నాటికి వన్ వాట్ సామర్థ్యం గల బ్యాటరీని కూడా విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది. దీన్ని వినియోగదారులు ఎలక్ట్రానిక్స్, డ్రోన్లలో ఉపయోగించవచ్చని తెలిపింది.
ఈ బ్యాటరీలో రెండు ప్రధాన భాగాలుంటాయి. రేడియో యాక్టివ్ ఎమిటర్, సెమీ కండక్టర్ అజ్జార్బర్ ఉంటాయి. ఇందులో అధిక వేగంతో ఎలక్ట్రాన్లను విడుదల చేస్తుంది. హానికరమైన బీటా కణాల నుంచి రక్షించడానికి కంపెనీ సన్నని అల్యూమినియం షీట్లను సైతం ఉపయోగించింది స్మార్ట్ఫోన్లు, కెమెరాలు వంటి పరికరాలను ఛార్జ్ చేయడానికి దాని శక్తి సరిపోకపోయినా.. బీటావోల్ట్ ఇప్పటికే భారీ ఉత్పత్తిలోకి ప్రవేశించింది. వైద్య పరికరాలు, అంతరిక్ష నౌక, డీప్ సీ సెన్సార్లు, పేస్మేకర్లు, ప్లానెటరీ రోవర్లు వంటి తక్కువ శక్తితో నడిచే డివైజ్‌లలో ఉపయోగించే వీలుంటుంది. లిథియం-అయాన్ బ్యాటరీలతో పోలిస్తే.. బీవీ 100 బ్యాటరీ పది రెట్లు ఎక్కువ శక్తి సాంద్రతను అందిస్తుంది. ఇది పేలిపోతుందని.. మంటలు అంటుకుంటాయనే భయం లేకుండా -60 నుంచి +120 డిగ్రీల సెల్సియస్ వరకు తీవ్ర ఉష్ణోగ్రతలను తట్టుకోగలదు. ఈ బ్యాటరీ పర్యావరణ అనుకూలమైనదని బీటావోల్ట్ పేర్కొంది. ఎందుకంటే దాని రేడియోధార్మిక మూలకం నికెల్-63 చివరికి రాగిగా మారుతుంది. ఇది రీసైకిల్ చేయడం సులభం, చౌకైందని కంపెనీ పేర్కొంది.