wireless charging room | గాలితోనే మీ ఫోన్ చార్జింగ్ చేసుకోవచ్చు.. ఎలా?
wireless charging room | కాలంతో పరుగులు తీసే ప్రస్తుత జీవనశైలిలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం అత్యవసరమైంది. అయితే, వాడిన కొద్దిసేపటికే బ్యాటరీలో చార్జింగ్ అయిపోవడం, పవర్ సాకెట్లో కేబుల్ ఉంచి.. డివైజ్‌లకు గంటల తరబడి చార్జింగ్ పెట్టడం ప్రధాన సమస్యగా మారింది. అలా కాకుండా.. పనిచేసుకునే గదిలోనే, మీరు ఎక్కడ ఉన్నా.. మీ ఎలక్ట్రానిక్ పరికరాలు వాటంతట అవే చార్జింగైతే ఎలా ఉంటుంది? మీరు చదివింది నిజమే. జపాన్ పరిశోధకులు దీన్ని సాధ్యం చేసి చూపించారు. అదే ‘వైర్లెస్ చార్జింగ్ రూమ్’ కాన్సెప్ట్.

ఏమిటీ ‘వైర్లెస్ చార్జింగ్ రూమ్’
ఎలక్ట్రానిక్ పరికరాల చార్జింగ్ కోసం వైర్లు, కేబుళ్లు, చార్జర్లు, పోర్టుల అవసరం లేకుండా.. ఒక గదిలో వాటికవే బ్యాటరీలో పవర్‌ను నింపుకునే విధానమే ‘వైర్లెస్ చార్జింగ్ రూమ్’ కాన్సెప్ట్. 10 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ చార్జింగ్ రూమ్‌లో గాలి ద్వారానే విద్యుదయస్కాంత శక్తి ప్రసారం అవుతుంది. దాన్నే ఎలక్ట్రానిక్ డివైజ్‌లు చార్జింగ్‌గా నింపుకుంటాయి.

వేటికి చార్జింగ్ చేయవచ్చు?
స్మార్ట్ వాచ్‌లు, ఫిట్నెస్ ట్రాకర్లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఆడియో సిస్టమ్‌లు, టేబుల్ ల్యాంప్స్, టేబుల్ ఫ్యాన్లు, ఆక్సీ మీటర్లతో పాటు హార్ట్ ఇంప్లాంట్లు అమర్చుకున్న వారికి కూడా ఈ గది పవర్‌ను సరఫరా చేయగలదు.

ఎలా చార్జ్ అవుతాయి?
గది గోడలకు అమర్చే ప్రత్యేక కెపాసిటర్ వ్యవస్థ ‘వైర్లెస్ చార్జింగ్ రూమ్’లో కీలక పాత్ర పోషిస్తాయి. లంప్డ్ కెపాసిటర్లుగా పిలిచే ఇవి థర్మల్ సిస్టమ్స్‌గా పనిచేస్తాయి. ఈ కెపాసిటర్ వ్యవస్థ విద్యుదయస్కాంత శక్తిని ప్రసారం చేస్తుంది. దీనికోసం వాటిలో ప్రత్యేక కాయిల్స్ ఉంటాయి. ఈ కాయిల్స్ సాయంతో విద్యుదయస్కాంత తరంగాలు విడుదలౌతాయి. ఇదే సమయంలో ప్రసరించే విద్యుత్‌శక్తిని కెపాసిటర్లు గ్రహిస్తాయి. మరోవైపు, విద్యుదయస్కాంత తరంగాలు నలుమూలల్లోకి ప్రసరించేలా గది మధ్యభాగంలో ఒక స్తంభాన్ని ఏర్పాటు చేసి దానికి పరిశోధకులు కెపాసిటర్ వ్యవస్థను అమర్చారు. ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉండే వైర్ కాయిల్స్ ఈ తరంగాలను గ్రహించి చార్జింగ్ అవుతాయి. ‘వైర్లెస్ చార్జింగ్ రూమ్’ రేంజ్ 10 అడుగుల వరకు ఉంటుంది.

గదిలో కరెంట్ సప్లయ్‌తో మనుషులకు ఏమీ కాదా?
అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ నిబంధనల ప్రకారం ‘వైర్లెస్ చార్జింగ్ రూమ్’ను తయారు చేసినట్టు పరిశోధకులు పేర్కొన్నారు. చార్జింగ్ కోసం ఈ వ్యవస్థ గరిష్ఠంగా 50 వాట్ల పవర్‌ను మాత్రమే విడుదల చేస్తుందన్నారు. అలాగే, మనుషులకు షాక్ కలిగించే విద్యుత్తును కెపాసిటర్ ముందుగానే గ్రహిస్తుందని, దీంతో కరెంట్ షాక్ సమస్య ఉండదని వివరించారు. గరిష్ఠంగా ఐదు ఎలక్ట్రానిక్ పరికరాలకు ఒకేసారి చార్జింగ్ పెట్టుకోవచ్చు
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి
Google Pixel 6 : గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ స్మార్ట్ఫోన్ల రిలీజ్ డేట్ ఫిక్స్
Realme : మీడియాటెక్ ప్రాసెసర్‌తో రియల్మీ తొలి ఫోన్.. త్వరలో రిలీజ్
iPhone 13 : ఐఫోన్ 13లో సరికొత్త ఫీచర్.. ఫోన్లో సిగ్నల్ లేకున్నా కాల్స్ చేసుకోవచ్చు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

