వాట్సాప్‌లో వచ్చిన కొత్త ఫీచర్ ఇదే

వాట్సాప్‌లో త్వరలోనే ఓ కొత్త ఫీచర్ రాబోతోందని ఈ మధ్య ఫేస్బుక్, వాట్సాప్ ఎగ్జిక్యూటివ్స్ చెప్పిన విషయం తెలుసు కదా. వ్యూ వన్స్ అనే ఆ కొత్త ఫీచర్ వచ్చేసింది. అయితే ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో మాత్రమే ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ఉపయోగించి ఒక యూజర్ అవతలి వ్యక్తికి పంపించే వీడియో లేదా ఫొటోను కేవలం ఒక్కసారి మాత్రమే చూసే వీలుంటుంది. ఆండ్రాయిడ్ 2.21.14.3 వెర్షన్ కోసం వాట్సాప్ బీటాలో ఈ ఫీచర్‌ను ప్రారంభించినట్లు వాబీటాఇన్ఫో వెల్లడించింది.
ఈ వెర్షన్‌లోని బీటా యూజర్లు ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్‌కు సంబంధించి కొన్ని స్క్రీన్షాట్లను కూడా రిలీజ్ చేసింది. దీనిని బట్టి ఈ ఫీచర్‌ను ఎలా వాడాలో తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ఉపయోగించి మీరు పంపించే ఫొటో లేదా వీడియోను అవతలి వ్యక్తి కేవలం ఒక్కసారి మాత్రమే చూడగలరు. దీనిని పంపిన యూజర్ కూడా అది డెలివర్ అయిందా, ఓపెన్ చేశారా అన్న స్టేటస్ చూడొచ్చు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

