వాట్సాప్ వాడీ వాడీ విసిగిపోయారా? ఈ మెసేజింగ్ యాప్‌నుంచి కొంత విరామం తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ చిట్కాలు పాటించాలని చెబుతున్నారు టెక్ నిపుణులు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణపొందిన మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ ఒకటి. రోజూ బిలియన్ల కొద్దీ మెసేజ్‌లు ఇందులో షేర్ అవుతూ ఉంటాయి. ఈ యాప్‌ను డిసేబుల్ చేసినా మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి.
వాట్సాప్ బ్యాక్‌గ్రౌండ్ డేటాను ఆఫ్ చేసినా, వాట్సాప్‌ను క్లోజ్ చేసినా వాట్సాప్ మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి. నోటిఫికేషన్స్ కూడా ఆగవు. మరి ఇవి ఆగిపోవాలంటే వాట్సాప్‌ను అన్ఇన్స్టాల్ చేయనక్కర్లేదు. వాట్సాప్‌ను అన్ఇన్స్టాల్ చేయకుండా డిసేబుల్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం.