Vivo X100 | వచ్చేవారం వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రొ గ్రాండ్ లాంఛ్ : డిజైన్, కెమెరా ఫీచర్లివే..!
వివో ఎక్స్ 100, (Vivo X100) వివో ఎక్స్100 ప్రొ వచ్చే వారం గ్రాండ్ లాంఛ్‌కు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ రెండు హాట్ డివైజ్‌లు జనవరి 4న కస్టమర్ల ముందుకు రానున్నాయని కంపెనీ ధ్రువీకరించింది.
న్యూఢిల్లీ : వివో ఎక్స్ 100, (Vivo X100) వివో ఎక్స్100 ప్రొ వచ్చే వారం గ్రాండ్ లాంఛ్‌కు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ రెండు హాట్ డివైజ్‌లు జనవరి 4న కస్టమర్ల ముందుకు రానున్నాయని కంపెనీ ధ్రువీకరించింది. ఈ స్మార్ట్ఫోన్లను ఇప్పటికే చైనా మార్కెట్లలో లాంఛ్ చేయగా డిజైన్ సహా పలు స్పెసిఫికేషన్లు వెల్లడయ్యాయి. ఇక వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రొ డిజైన్ విషయానికి వస్తే ఈ రెండు స్మార్ట్ఫోన్లు ఎక్స్90 సిరీస్ డిజైన్‌ను పోలి ఉంటాయి. వెనుకభాగంలో సర్క్యులర్ కెమెరా హౌసింగ్ గత ఎక్స్ సిరీస్ జనరేషన్‌ను గుర్తుకుతెస్తుంది.
రెండు స్మార్ట్ఫోన్లు స్లీక్ డిజైన్‌తో కనిపిస్తాయి. 7 ఇంచ్ డిస్ప్లేతో పట్టుకునేందుకు సులభంగా ఉన్న ఈ రెండు స్మార్ట్ఫోన్ల కెమెరా మాడ్యూల్స్‌ను గమనిస్తేనే రెండు డివైజ్‌ల మధ్య వ్యత్యాసం తెలుస్తుంది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం వివో ఎక్స్100 ప్రొ డిజైన్ సూర్యుడి నుంచి ఇన్స్పిరేషన్ కాగా, ఎక్స్100 మూన్ ఇన్స్పిరేషన్. ఈ రెండు స్మార్ట్ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్‌సెట్‌ను కలిగిఉంటాయి. ర్యాం, స్టోరేజ్ ఆఫరింగ్స్ ఇరు మోడల్స్ మధ్య వ్యత్యాసాలున్నాయి.
వివో ఎక్స్100 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండగా ఎక్స్100 ప్రొ కేవలం 16జీబీ ర్యాం, 512జీబీ స్టోరేజ్ వేరియంట్లో లభిస్తోంది. వివో ఎక్స్100, ఎక్స్100ప్రొ 8టీ ఎల్టీపీఓ అమోల్డ్ డిస్ప్లేతో 6.78 ఇంచ్ స్క్రీన్ కలిగిఉన్నాయి. ఇక రెండు స్మార్ట్ఫోన్లు మెరుగైన కెమెరా ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటాయి. రెండు స్మార్ట్ఫోన్లు క్వాడ్ కెమెరా సెటప్‌తో రానుండగా ఎక్స్100 ప్రొ 50ఎంపీ మెయిన్ కెమెరా, స్పెషల్ పెరిస్కోప్ జూమ్ కెమెరాతో కస్టమర్ల ముందుకు రానుంది. దీనికి అదనంగా 50ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్ ఆకట్టుకుంటుంది. ఇక వివో ఎక్స్100 50ఎంపీ వైడ్‌యాంగిల్ లెన్స్, 64ఎంపీ సెన్సర్‌తో 70ఎంఎం జూమ్ లెన్స్ కలిగిఉంది.
Read More :
Godfather of AI | నేరస్తులు, ఉగ్రవాదుల చేతుల్లోకి లేటెస్ట్ టెక్నాలజీ..? : ఏఐ గాడ్‌ఫాదర్ కీలక వ్యాఖ్యలు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

