న్యూఢిల్లీ : వివో త్వరలో దేశీ మార్కెట్లో వివో వీ29ఈ (Vivo V29e)ని లాంఛ్ చేయనుంది. లాంఛ్‌కు ముందు కర్వ్డ్ డిస్ప్లేతో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ స్లిమ్ డిజైన్‌ను కంపెనీ వెల్లడించింది. కెమెరా స్పెసిఫికేషన్స్‌ను కూడా వివో రివీల్ చేసింది. వివో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ 50ఎంపీ సెల్ఫీ కెమెరా, ఓఐఎస్‌తో కూడిన 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో కస్టమర్ల ముందుకు రానుందని వివో వీ29ఈ ప్రోడక్ట్ పేజ్ వెల్లడించింది.
ఇక వెనుక భాగంలో మ్యాక్రో లెన్స్‌తో మరో కెమెరా ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. మెరుగైన, మన్నికైన ఫోకస్ కోసం సెల్ఫీ కెమెరా ఐ ఆటో ఫోకస్‌కు సపోర్ట్ చేస్తుందని వివో పేర్కొంది. 64 మెగాపిక్సెల్స్, ఓఐఎస్‌తో సరైన లైటింగ్ లేకున్నా మెరుగైన క్లారిటీతో నైట్ పోర్ట్రయిట్స్తో పాటు బ్రైటర్ ఇమేజ్‌లను పొందవచ్చని వివో తెలిపింది. వివో వీ29ఈ రెండు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుందని కంపెనీ పేర్కొంది.
వీ29ఈ ఆర్టిస్టిక్ రెడ్ ఎడిషన్ కలర్ ఛేంజింగ్ గ్లాస్ ఫీచర్‌తో ఆకట్టుకోనుంది. రియర్ ప్యానెల్ యూవీ లైట్స్‌కు ఎక్స్పోజ్ అయినప్పుడే ఈ ఫీచర్ రన్ అవుతుంది. వీ25 సహా పలు డివైజ్‌ల్లో ఇదే తరహా కలర్ ఛేంజింగ్ టెక్నాలజీని వివో వాడుతోంది. ఇక వివో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ 6.73 ఇంచ్ డిస్ప్లే, 4600ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ ఎస్ఓసీ ప్రాసెసర్ వంటి ఫీచర్లతో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 30,000లోపు అందుబాటులో ఉండనుంది. వివో వీ29ఈ బేస్ మోడల్ రూ. 25,000 నుంచి లభించే అవకాశం ఉంది.
Read More :
Bomb Threat | విస్తారా విమానానికి బాంబు బెదిరింపు : ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు