Bomb Threat | విస్తారా విమానానికి బాంబు బెదిరింపు : ఎయిర్పోర్ట్లో తనిఖీలు
ఢిల్లీ నుంచి పుణే వెళ్లాల్సిన విస్తారా విమానంలో బాంబు (Bomb Threat) ఉందని సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి పుణే వెళ్లాల్సిన విస్తారా విమానంలో బాంబు (Bomb Threat) ఉందని సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విమానం నిలిపివేసిన అనంతరం క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. జీఎంఆర్ కాల్ సెంటర్కు శుక్రవారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.
ఢిల్లీ నుంచి పుణే వెళ్లాల్సిన యూకే971 విమానంలో భద్రతా తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నందున జాప్యం నెలకొందని, భద్రతా సంస్ధలకు తాము సహకరిస్తున్నామని విస్తారా ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కన్నారు. బాంబు బెదిరింపు నేపధ్యంలో విమానాశ్రయంలోని నిర్జన ప్రదేశంలో విమానంలో అణువణువునూ గాలిస్తున్నారు.
ప్రయాణీకులందరితో పాటు వారి లగేజీని విమానం నుంచి బయటకు తీసుకువ్చారు. విమానం టేకాఫ్ తీసుకోవడంలో జాప్యం కారణంగా ప్రయాణీకులు విశ్రాంతి తీసుకునేందుకు అన్ని ఏర్పాట్లూ చేశామని విస్తారా ప్రతినిధి తెలిపారు. శుక్రవారం ఉదయం బోర్డింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా ఏడు గంటల ప్రాంతంలో బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
Read More :
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

