Heart Attack | నడి సంద్రంలో గుండెపోటు.. సమయానికి నౌక దగ్గరకు వెళ్లి చైనా దేశస్థుడిని కాపాడిన ఇండియన్ కోస్ట్‌గార్డ్
Heart Attack | సముద్ర పరిశోధన నిమిత్తం బయల్దేరిన ఓ నౌకలోని చైనా దేశస్థుడికి హఠాత్తుగా గుండెపోటు రాగా, సమాచారం అందుకున్న ఇండియన్ కోస్ట్‌గార్డ్ వెంటనే రంగంలోకి దిగి ఆ వ్యక్తిని కాపాడింది.
Heart Attack | ముంబయి, ఆగస్టు 17: సముద్ర పరిశోధన నిమిత్తం బయల్దేరిన ఓ నౌకలోని చైనా దేశస్థుడికి హఠాత్తుగా గుండెపోటు రాగా, సమాచారం అందుకున్న ఇండియన్ కోస్ట్‌గార్డ్ వెంటనే రంగంలోకి దిగి ఆ వ్యక్తిని కాపాడింది. బుధవారం అర్ధరాత్రి..అందునా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని ఎదుర్కొంటూ కోస్ట్‌గార్డ్ సిబ్బంది అరేబియా సముద్రంపైకి వెళ్లి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్టు ఇండియన్ కోస్ట్‌గార్డ్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నది.
ముంబయికి 200 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంపై ఈ ఘటన చోటుచేసుకుంది. పనామా జెండాను కలిగిన రిసెర్చ్ నౌకలో గుండెపోటుకు గురైన డాంగ్ ఫాంగ్ కాన్ టాన్‌ను రక్షించేందుకు డామన్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ను పంపారు. బాధితుడికి వెంటనే వైద్య చికిత్స అవసరమవుతుందన్న ఆలోచనతో అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ‘సీజీ ఏఎల్‌హెచ్ ఎంకే-3’ని ఉపయోగించామని, ప్రాథమిక చికిత్స కూడా అందించామని కోస్ట్‌గార్డ్ పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

