Whatsapp | స్నేహితులతో బాతాఖానీ అయినా.. కొలిగ్స్‌తో మీటింగ్ అయినా.. పిల్లల హోంవర్క్ అయినా.. ఫ్యామిలీ డిస్కషన్స్ అయినా.. ఇప్పుడు అన్నింటికీ ఒక్కటే వేదిక వాట్సాప్. ప్రేయసితో ఏకాంతంగా నాలుగు ప్రేమ ముచ్చట్లు పంచుకోవాలన్నా.. పది మందితో ఓ సమస్యపై చర్చించాలన్నా వాట్సాప్‌నే వాడుతున్నాం. మొత్తానికి పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా ఎన్నో రకాలుగా వాట్సాప్ ఉపయోగపడుతూనే ఉంది. మన జీవితంతో అంతలా మమేకమైన వాట్సాప్‌ను వాడాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ కచ్చితంగా ఉండాల్సిందే. డేటా కనెక్షన్ లేకుంటే వాట్సాప్‌ను వాడలేం. కానీ ఇప్పుడు కొత్త ఫీచర్ వచ్చేసింది. నెట్ ఉన్నా లేకున్నా వాట్సాప్‌ను వాడొచ్చు. నచ్చిన వాళ్లకు మెసేజ్‌లు చేయొచ్చు.
ఇంటర్నెట్ లేకున్నా వాట్సాప్ ఎలా వాడతారు? దీనికోసం ఏదో ఒక థర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందేమో అని అనుకుంటున్నారేమో ! అలా ఏం అక్కర్లేదు. ఈ సదుపాయాన్ని వాట్సాప్‌నే అధికారికంగా అందిస్తోంది. ఆ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? దాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
☛ ముందుగా వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్టోరేజి అండ్ డేటా మీద క్లిక్ చేయాలి.
☛ స్టోరేజి అండ్ డేటా ఓపెన్ చేశాక కిందకి స్క్రోల్చేస్తే ప్రాక్సీ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఒకవేళ ప్రాక్సీ సెట్టింగ్స్ కనిపించకపోతే వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌ను అప్డేట్ చేసుకోవాలి.
☛ ప్రాక్సీ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ప్రాక్సీ అడ్రస్ సెట్ చేసుకోవాలి. కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వగానే ఒక చెక్ మార్క్ కనిపిస్తుంది. అప్పుడు ఇంటర్నెట్ లేకుండానే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో ఛాటింగ్ చేసుకోవచ్చు.
ప్రాక్సీ ద్వారా వాట్సాప్‌ను ఉపయోగించడం ద్వారా ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లదని, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా సురక్షితంగా ఉంటుందని మాతృసంస్థ మెటా చెబుతోంది. అయినప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిదని సైబర్ నిపుణులు సూచిస్తారు. అత్యవసరమైతేనే ప్రాక్సీని యూజ్ చేయాలని సలహానిస్తున్నారు.