Smartphones | ఈ నెలలో రాబోతున్న స్మార్ట్ఫోన్స్ ఇవే.. ఏ ఫోన్, ఎప్పుడు లాంఛ్ అంటే
Smartphones : ప్రతి నెలా కొత్త స్మార్ట్ఫోన్లు దేశంలో విడుదలవుతూనే ఉన్నాయి. ఏప్రిల్ నెలలో కూడా వన్ప్లస్, వివో, రియల్మి, ఐకూ,రెడ్మి, ఒప్పో వంటి సంస్థల నుంచి కొత్త ఫోన్లు మార్కెట్లోకి రాబోతున్నాయి.
Smartphones : ప్రతి నెలా కొత్త స్మార్ట్ఫోన్లు దేశంలో విడుదలవుతూనే ఉన్నాయి. ఏప్రిల్ నెలలో కూడా వన్ప్లస్, వివో, రియల్మి, ఐకూ,రెడ్మి, ఒప్పో వంటి సంస్థల నుంచి కొత్త ఫోన్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. వీటిలో కొన్ని ఫోన్లు, వాటి కీలక ఫీచర్లకు సంబంధించిన వివరాలు ఇవి.
రియల్మి 16 5జీ
ఇది ఏప్రిల్ 2న ఇండియా మార్కెట్లోకి విడుదల కానుంది. పవర్ఫుల్ 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 ఓఎస్, యూఐ 7.0, ఐపీ69 రేటింగ్, 12జీబీ ర్యామ్, 6.57 అంగుళాల డిస్ప్లే, 50 ఎంపీ మెయిన్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి.
రెడ్మి నోట్ 15ఎస్ఈ 5జీ
షావోమీ సంస్థ నుంచి రెడ్మి నోట్ 15ఎస్ఈ పేరుతో 5జీ ఫోన్ ఈ నెల 2న విడుదల కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ఫీచర్లేవీ ఇంకా విడుదల కాలేదు. అయితే, బోల్డ్ రెడ్ ఫినిష్ కలర్, వెగాన్ లెదర్ బ్యాక్ వంటి ఆకర్షణలతో రానుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న రెడ్మి నోట్ 15 5జీ ఫోన్కంటే కొన్ని మెరుగైన ఫీచర్లుండే అవకాశం ఉంది.
వివో వీ70 ఎఫ్ఈ
వివో సంస్త నుంచి ఈ ఫోన్ కూడా ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఇది ప్రీమియమ్ ఫోన్. 6.83 అంగుళాల 1.5కే ఓలెడ్ డిస్ప్లే, 1,900 నిట్స్ బ్రైట్నెస్, 200 ఎంపీ మెయిన్ కెమెరా, 50 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటివి ప్రధాన ఫీచర్లు.
వన్ప్లస్ నార్డ్ 6
ఇటీవలి కాలంలో కాస్త వెనుకబడినట్లు కనిపించిన వన్ప్లస్ నుంచి నార్డ్ సిరీస్లో భాగంగా నార్డ్ 6 ఫోన్ ఏప్రిల్ 7న విడుదల కానుంది. 165 హెర్జ్ అమోలెడ్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 8స్ జనరేషన్ చిప్సెట్, 9,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయి.
ఏఐ+ నోవా 2 సిరీస్
తక్కువ ధరలో మంచి ఫీచర్లతో ఆకట్టుకుంటున్న ఏఐ+ నోవా 2 సిరీస్లో భాగంగా రెండు ఫోన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో ఒక అల్ట్రా వేరియెంట్ కూడా ఉంటుంది. దీనిలో కస్టమైజబుల్ లైట్ రింగ్ ఉంటుంది. ఇది నోటిఫికేషన్లకు పనికొస్తుంది. కెమెరా ఈ ఫోన్లలో ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. మిడ్ రేంజ్లోనే ఈ ఫోన్లు వస్తాయి.
వివో టీ5ప్రో 5జీ
6.8 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్జ్ రిఫ్రెష్రేట్, స్నాప్డ్రాగన్ 7ఎస్, జనరేషన్ 4 చిప్సెట్, 9020 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 ఎంపీ సెన్సర్ వంటి ఫీచర్లుంటాయి. ఈ నెల మూడో వారంలో ఈ ఫోన్లు మార్కెట్లోకి రావొచ్చు.
ఐకూ జడ్11
ఐకూ నుంచి ఐకూ జడ్ 11 పేరుతో రానున్న ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది. 165 హెర్జ్ అమోలెడ్ డిస్ప్లే, డిమెన్సిటీ 8500 చిప్సెట్ 16జీబీ+512జీబీ, 9020 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఐపీ68 రేటింగ్ వంటి ఫీచర్లున్నాయి.
ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా
ఈ నెలలో ప్రపంచవ్యాప్తగా ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా ఫోన్ విడుదల కానుంది. అంతర్జాతీయ మార్కెట్లోకి ఈ నెల 21న విడుదలవుతుంది. ఆ వెంటనే ఇండియాలో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా ఫ్లాగ్షిప్ ఫోన్. 6.82 అంగుళాల 2కే ఎల్టీపీఓ ఓలెడ్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జనరేషన్ 5 చిప్సెట్ వంటి ఫీచర్లున్నాయి. వీటితోపాటు మరికొన్ని ఫోన్లు కూడా లాంఛ్ కాబోతున్నాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

