TCS | కార్యాలయాలకు రాకుంటే కఠిన చర్యలు : ఉద్యోగులకు టీసీఎస్ వార్నింగ్
వర్క్ ఫ్రం ఆఫీస్ నిబంధనలను ఉద్యోగులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపడతామని టీసీఎస్ (TCS) హెచ్చరించింది.
న్యూఢిల్లీ : వర్క్ ఫ్రం ఆఫీస్ నిబంధనలను ఉద్యోగులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపడతామని టీసీఎస్ (TCS) హెచ్చరించింది. వారానికి మూడు రోజులు కార్యాలయాల నుంచి పనిచేయాలని టీసీఎస్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు నెలకు కనీసం 12 రోజుల పాటు కార్యాలయాలకు రావాలని కంపెనీ కోరింది.
ఈ నిబంధనలను ఉల్లంఘించి కార్యాలయాలకు హాజరు కాని ఉద్యోగులపై కఠిన చర్యలు చేపడతామని టీసీఎస్ జారీ చేసిన మెమోలో హెచ్చరించింది. కేటాయించిన రోస్టర్‌కు అనుగుణంగా తక్షణమే ఉద్యోగులందరూ వారి కార్యాలయాల్లో రిపోర్ట్ చేయాలని లేటెస్ట్ మెమోలో టీసీఎస్ స్పష్టం చేసింది. రెండేండ్ల కిందట కంపెనీలో చేరిన ఉద్యోగులు పని ప్రదేశం గురించి తెలుసుకుని, మెరుగైన ఫలితాలు అందించేందుకు వర్క్ ఫ్రం ఆఫీస్ పాలసీ ఉపకరిస్తుందని పేర్కొంది.
కంపెనీలో చేరిన నూతన ఉద్యోగులు టీసీఎస్ వాతావరణాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు సహోద్యోగులతో కలిసి పనిచేస్తూ ఎదిగే అవకాశం అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. కంపెనీ ఉద్యోగుల్లో పలువురు కార్యాలయానికి తిరిగి రావడంతో ఈ విధానం మంచి ఫలితాలను ఇచ్చింది. నెలలో సగటున వారానికి కనీసం మూడు రోజులు అసోసియేట్‌లందరూ ఆఫీసు నుండి పని చేయడమే మా లక్ష్యమని చెప్పారు. వర్క్ ఫ్రం హోం పాలసీకి ఉద్యోగులందరూ సహకరించాలని కోరారు.
Read More
ChatGPT | ఏఐతో మానవాళి అంతరించిపోతుంది : టెక్ దిగ్గజాల వార్నింగ్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

