న్యూఢిల్లీ : శాంసంగ్ నెక్ట్స్ జనరేషన్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 5 (Samsung Galaxy Z Flip 5), వాచ్ 6 సిరీస్ డిజైన్ లీక్ అయింది. జులైలో జరిగే గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్‌కు ముందు ఈ హాట్ డివైజ్‌ల ఫీచర్లపై కీలక వివరాలు వెలుగుచూశాయి. రెండు డివైజ్‌లు ముఖ్యంగా ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ డిజైన్‌లో సరికొత్త మార్పులు ఆకట్టుకోనున్నాయి. లీకైన డిజైన్ ప్రకారం ఫ్లిప్ 5 యూజర్లు యూట్యూబ్, జీమెయిల్ వంటి యాప్స్‌ను రన్ చేసుకునేందుకు వీలుగా అతిపెద్ద డిస్ప్లే కవర్‌తో కస్టమర్ల ముందుకు రానుంది.
ఇక గెలాక్సీ వాచ్ 6 సిరీస్ రొటేటింగ్ బెజెల్స్‌ను తిరిగి ప్రవేశపెట్టనుంది. గెలాక్సీ వాచ్ 5 సిరీస్‌లో ఈ ఫీచర్‌ను శాంసంగ్ తప్పించింది. స్మార్ట్‌వాచ్‌లో సెట్టింగ్స్, యాప్స్ నేవిగేషన్లోకూడా రొటేటింగ్ బెజెల్ యూజర్లకు సాయపడుతుంది. గెలాక్సీ జడ్ ఫ్లిప్ 5 లీకైన ఇమేజ్ ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో రెండు కెమెరాలు, మెయిన్ డిస్ప్లేపై ఓ అదనపు కెమెరా ఉంటుంది.
గెలాక్సీ ఫ్లిప్ 4లో 1.9 ఇంచ్ డిస్ప్లే స్ధానంలో లేటెస్ట్ డివైజ్‌లో 3.4 ఇంచ్ వ్యూయింగ్ ఏరియా ఉంటుంది. న్యూ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 5 స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్సెట్, ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్‌తో కూడిన 6.7 ఇంచ్ మెయిన్ స్క్రీన్‌తో కస్టమర్ల ముందుకు రానుంది. ఈ హాట్ డివైజ్ 25డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో 3700ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుంది. ఇక గెలాక్సీ వాచ్ 6 సిరీస్‌లో భాగంగా వాచ్ 6, వాచ్ 6 క్లాసిక్ మోడల్స్‌తో పాటు భిన్న సైజుల్లో లభిస్తాయి. వాచ్ 6 సిరీస్ డిజైన్, ఫీచర్లలో స్వల్ప మార్పులు చేపట్టారు. క్రీమ్, గ్రే కలర్స్‌లో వాచ్ 6 అందుబాటులో ఉండగా, క్లాసిక్ మోడల్ సిల్వర్, బ్లాక్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుందని టెక్ నిపుణలు లీక్స్‌లో వెల్లడించారు.
Read More :
iPhone 15 | భారీ అప్గ్రేడ్లతో ఆకట్టుకోనున్న ఐఫోన్ 15 సిరీస్