iPhone 15 | భారీ అప్గ్రేడ్లతో ఆకట్టుకోనున్న ఐఫోన్ 15 సిరీస్
యాపిల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో తన నెక్ట్స్ జనరేషన్ ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్‌ను లాంఛ్ చేస్తుండగా లేటెస్ట్ ఐఫోన్ల ఫీచర్లపై పలు లీకులు వెల్లడవుతున్నాయి.
న్యూఢిల్లీ : యాపిల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో తన నెక్ట్స్ జనరేషన్ ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్‌ను లాంఛ్ చేస్తుండగా లేటెస్ట్ ఐఫోన్ల ఫీచర్లపై పలు లీకులు వెల్లడవుతున్నాయి. ఈ ఏడాది ఐఫోన్ 15 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రొ, ఐఫోన్ 15 ప్రా మ్యాక్స్ లాంఛ్ కానున్నాయి. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్స్ మూడు భారీ అప్‌గ్రేడ్స్‌తో కస్టమర్ల ముందుకు రానున్నాయని లీకులు వెల్లడించాయి.
ఇక ఈ లీకుల ప్రకారం ఐఫోన్ 15 సిరీస్‌లో స్టాండర్డ్ మోడల్స్ యాపిల్ న్యూ డైనమిక్ ఐలండ్ ఫీచర్‌ను పొందనున్నాయి. ఇక ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ గత ఏడాది ఐఫోన్ 14 ప్రొ మోడల్స్‌లో చూసిన విధంగా మ్యాట్ ఫినిష్‌తో ఫ్రాస్టెడ్ గ్లాస్ బ్యాక్‌ను కలిగిఉంటాయి. రెగ్యులర్ వెర్షన్లు ఐఫోన్ 14 సిరీస్‌లో ప్రొ మోడల్స్ తరహాలో 48 ఎంపీ రియర్ కెమెరాలతో ఆకట్టుకోనున్నాయి. హైఎండ్ మోడల్స్‌లో లభించే ఆప్టికల్ జూమ్ టెలిఫోటో లెన్స్ మాత్రం స్టాండర్డ్ మోడల్స్‌లో ఎక్స్పెక్ట్ చేయొద్దని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
ప్రొ మ్యాక్స్ మోడల్ మెరుగైన కెమెరా మాడ్యూల్తో కస్టమర్ల ముందుకు రానుందని అంచనా వేస్తున్నారు. పెరిస్కోప్ లెన్స్‌లతో పాటు ఇతర సెన్సర్లలో 5-6ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన మెరుగైన కెమెరాలు ఈ మోడల్లో అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. ఇక గత యాపిల్ ఫోన్లలో వాడిన లైట్నింగ్ పోర్ట్ స్ధానంలో 2023 ఐఫోన్లు యూఎస్బీ టైప్-సీ పోర్ట్‌తో కస్టమర్ల ముందుకు రావడం యాపిల్ ఫోన్లలో అతిపెద్ద మార్పని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు.
Read More :
Naya Mall | ఈ కుర్చీ ధర 3 లక్షలు.. ఇందులో అంత స్పెషాలిటీ ఏముందంటే..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

