న్యూఢిల్లీ : ఫిబ్రవరి 1న శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 సిరీస్ లాంఛ్ కానుండగా లాంఛ్‌కు ముందు ఈ ఫ్లాగ్షిప్ ఫోన్లకు సంబంధించి పలు వివరాలు లీక్ అయ్యాయి. భారీ బ్యాటరీతో మెరుగైన కెమెరా ఫీచర్లతో గెలాక్సీ ఎస్23 కస్టమర్ల ముందుకు రానుందని విన్‌ఫ్యూచర్ అంచనా వేసింది. గెలాక్సీ ఎస్22తో పోలిస్తే గెలాక్సీ ఎస్23లో మేజర్ అప్‌గ్రేడ్ ఉండబోదని కూడా ఈ లీక్స్ సంకేతాలు పంపాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ క్వాల్‌కాం టాప్ఎండ్ చిప్సెట్తో 6.1 ఇంచ్ సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో రానుందని విన్‌ఫ్యూచర్ లీక్స్ వెల్లడించాయి. గెలాక్సీ ఎస్23+ 6.6 ఇంచ్ డిస్ప్లేతో ఎఫ్‌హెచ్‌డీ+ స్క్రీన్‌తో ఆకట్టుకోనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ప్రొ క్యూహెచ్డీ+ డిస్ప్లేతో ఆకట్టుకోనుందని అంచనా.
స్టాండర్డ్, ప్లస్ మోడల్ 12 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఓఐఎస్ సపోర్ట్‌తో వెనుకభాగంలో 50ఎంపీ కెమెరా ఉంటుంది. దీంతో పాటు 12 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 10ఎంపీ టెలిఫొటో కెమెరా ఉంటాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌పై రన్ అవుతుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 రూ . 76,700 ప్రారంభ ధర నుంచి అందుబాటులో ఉంటుంది.