రానా దగ్గుబాటి-సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి కోలు కోలమ్మా కోలో సాంగ్ ను ఇప్పటికే మేకర్స్ విడుదల చేయగా..అద్బుతమైన స్పందన వస్తోంది. కోలు కోలమ్మా కోలో కోలో నా సామి..మనసే మేలు కొని చూసే..కలలో నిండినవాడే కనుల ముందర ఉంటే నూరేళ్లు నిదురా రాదులే అంటూ తన ప్రియుడిని ఊహించుకుంటూ సాయిపల్లవి పాడుకుంటున్న పాట అద్బుతమైన లిరిక్స్ తో పల్లెప్రియుల మనసు దోచేస్తోంది.
తాజాగా విరాటపర్వం టీం మెంబర్స్ ఈ సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. డైరెక్టర్ వేణుఊడుగుల, మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి, పాటల రచయిత చంద్రబోస్ పాటను తెరపైకి తీసుకు రావడం వెనకున్న విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. మేకింగ్ వీడియోలో సాయిపల్లవి పల్లెటూరి యువతి గెటప్ లో లంగావోణిలో కనిపిస్తూ అందరిని ఫిదా చేస్తోంది చంద్రబోస్ రాసిన ఈ పాటను దివ్య మాలిక, సురేశ్ బొబ్బిలి కలిసి ఆలపించారు.
విరాటపర్వం వేసవి కానుకగా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ ప్రాజెక్టులో ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, , జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్, నవీన్ చంద్ర ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి-సురేశ్ బాబు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.