ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. ఈ 8 యాప్స్ మీ ఫోన్లో ఉంటే వెంటనే అన్ఇన్స్టాల్ చేసుకోండి..
Autolycos Malware | ఆండ్రాయిడ్ యూజర్లకు జాగ్రత్త !! స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న జోకర్ తరహా మరో మాల్వేర్ను సైబర్ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు. గూగుల్ స్టోర్‌లోని 8 యాప్స్‌లో ఆటోలికోస్ అని పిలవబడే ఈ డేంజరస్ మాల్వేర్ ఉందని వెల్లడించారు. ఈ ప్రమాదకరమైన అప్లికేషన్స్ గుర్తించిన వెంటనే అప్రమత్తమైన గూగుల్.. వీటిలో ఆరు యాప్స్‌ను ఇప్పటికే ప్లే స్టోర్ నుంచి తొలగించింది. అయితే దీనికోసం ఆరు నెలల సమయం పట్టినట్టు తెలుస్తోంది. తాజాగా మిగిలిన రెండు యాప్స్‌ను కూడా ప్లే స్టోర్ నుంచి తొలగించింది. అయితే ఇప్పటికే ఈ యాప్స్‌ను 30 లక్షల మందికి పైగా యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ మాల్వేర్ ఏం చేస్తుంది?
మిగిలిన మాల్వేర్లతో పోలిస్తే ఇది కాస్త ప్రమాదకరమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ ఆటోలికోస్ మాల్వేర్ మీ మొబైల్‌లోకి చేరగానే.. తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. ముందుగా మీ మెసేజ్‌లను సీక్రెట్‌గా చదివేస్తుంది. అలాగే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న ఇతర యాప్స్ నుంచి కూడా మొత్తం డేటాను తస్కరిస్తుంది. వీటి ద్వారా మనకు తెలియకుండానే మన బ్యాంక్ అకౌంట్స్‌లోని డబ్బులను ఖాళీ చేస్తుంది. అందుకే ఈ మాల్వేర్ను గుర్తించిన 8 యాప్స్ మీ ఫోన్లో ఉంటే వెంటనే అన్ఇన్స్టాల్ చేసుకోవాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు.
ఇవే ఆ 8 యాప్స్
› Vlog Star Video Editor
› Creative 3D Launcher
› WOW Beauty Camera
› Gif Emoji Keyboard
› Freeglow Camera
› Coco Camera V1.1
› Funny Camera by Kelly Tech
› Razer Keyboard & Theme by rxcheldiolola
Read More :
Facebook | ఫేస్బుక్లో క్రేజీ అప్డేట్ : ఒకే ఖాతాపై మల్టిపుల్ ప్రొఫైల్స్ ఓపెన్ చేసే వెసులుబాటు!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

