న్యూఢిల్లీ : యూజర్లకు మెరుగైన అనుభూతిని అందించేందుకు పలు నూతన ఫీచర్లపై ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కసరత్తు సాగిస్తోంది. యూజర్లు వాయిస్ నోట్స్‌ను స్టేటస్ అప్‌డేట్స్‌గా పెట్టుకునే వెసులుబాటును కల్పించడంపై వాట్సాప్ పనిచేస్తోంది. ప్రస్తుత సెటప్‌లో వాట్సాప్ స్టేటస్‌గా ఇమేజ్‌లు, వీడియోలను పోస్ట్ చేసేందుకు యూజర్లకు వెసులుబాటు ఉంది.
త్వరలోనే వాట్సాప్ స్టేటస్‌లలో వాయిస్ నోట్ సపోర్ట్‌ను జోడించవచ్చని ఈ దిశగా ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ కసరత్తు చేస్తోందని వాబీటాఇన్ఫో రిపోర్ట్ పేర్కొంది. స్టేటస్‌ల్లో వాయిస్ నోట్ సపోర్ట్ పనిచేసే తీరును వివరించే ఫీచర్ స్క్రీన్‌షాట్‌ను కూడా వాబీటాఇన్ఫో షేర్ చేసింది.
స్టేటస్ ట్యాబ్ దిగువన ఉండే న్యూ ఐకాన్ ద్వారా యూజర్లు వాయిస్ నోట్‌ను సత్వరమే స్టేటస్ అప్డేట్కు పంపవచ్చని పేర్కొంది. ఈ ఫీచర్‌ను వాట్సాప్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నందున దీన్ని ఎప్పుడు బీటా టెస్టర్ల కోసం రిలీజ్ చేస్తారనేది తెలియదని పేర్కొంది.