Facebook | ఫేస్బుక్లో క్రేజీ అప్డేట్ : ఒకే ఖాతాపై మల్టిపుల్ ప్రొఫైల్స్ ఓపెన్ చేసే వెసులుబాటు!
వ్యక్తిగత జీవితంలో జరిగే విషయాలు ఫేస్బుక్లో తమ ప్రొఫెషనల్ సర్కిల్‌కు తెలియకూడదని కోరుకునే వారికి సోషల్ మీడియా దిగ్గజం సరికొత్త ఫీచర్‌ను తీసుకురానుంది.
న్యూఢిల్లీ : వ్యక్తిగత జీవితంలో జరిగే విషయాలు ఫేస్బుక్లో తమ ప్రొఫెషనల్ సర్కిల్‌కు తెలియకూడదని కోరుకునే వారికి సోషల్ మీడియా దిగ్గజం సరికొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. యూజర్లు ఒకే ఖాతాలో పలు ప్రొఫైల్స్‌ను క్రియేట్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్‌ను ఫేస్బుక్ తమ యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు సాగిస్తోంది. ఫేస్బుక్ ప్రస్తుతం ఈ ఫీచర్‌ను తన ప్లాట్‌ఫాంపై పరీక్షిస్తోంది. భిన్న ప్రొఫైల్స్‌ను భిన్నమైన వ్యక్తులతో యూజర్లు పంచుకునేలా ఈ ఫీచర్‌పై ఫేస్బుక్ కసరత్తు సాగిస్తోంది.
ఉదాహరణకు ఓ యూజర్ తన సహోద్యోగుల కోసం ఓ ప్రొఫైల్‌ను నిర్వహించడంతో పాటు ఫ్రెండ్స్ కోసం డెడికేటెడ్‌గా మరో ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ఫేస్బుక్లో ప్రస్తుతం పలు ఖాతాలను నిర్వహించే వెసులుబాటు ఉన్నా ప్రతి ఖాతాకు డిఫరెంట్ ఐడీలను వాడాల్సి ఉంది. సోషల్ మీడియా దిగ్గజం ప్రవేశపెడుతున్న తాజా ఫీచర్‌తో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఒకే ఫేస్బుక్ ఖాతాలో యూజర్లు మల్టిపుల్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకునేలా లేటెస్ట్ ఫీచర్‌ను డెవలప్ చేస్తున్నామని ఫేస్బుక్ ప్రతినిధి లియెనార్డ్ ల్యామ్ టెక్క్రంచ్తో తెలిపారు.
అదనపు ప్రొఫైల్స్ తెరిచే విషయంలో యూజర్లు తమ రియల్ నేమ్‌ను యాడ్ చేయాల్సిన అవసరం లేదని టెక్‌క్రంచ్ రిపోర్ట్ పేర్కొంది. ఎలాంటి ప్రొఫైల్ నేమ్స్, యూజర్ నేమ్‌లను యూజర్లు వాడేందుకు అనుమతిస్తారు. యూజర్లు నెంబర్లు, స్పెషల్ క్యారెక్టర్లను వాడాల్సిన అవసరం లేదు. యూజర్ క్రియేట్ చేసే అదనపు ప్రొఫైల్స్ అన్నింటికీ భద్రత, గోప్యత నిబంధనలు యథాతథంగా ఉంటాయని ఫేస్బుక్ పేర్కొంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

