న్యూఢిల్లీ : ఈ ఏడాది ఏప్రిల్‌లో రెడ్మి కే40 గేమింగ్ ఎడిషన్ లాంఛ్ కాగా త్వరలోనే రెడ్మి కే50 గేమింగ్ ఎడిషన్ లాంఛ్ చేసేందుకు సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్లో లాంఛ్ అవుతుందని చెబుతుండగా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రానుందని మరికొన్ని రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. రెడ్మి కే50 గేమింగ్ ఎడిషన్ డైమెన్షన్ 9000 చిప్సెట్తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కస్టమర్లను ఆకట్టుకుంటుందని తాజా లీక్‌లు పేర్కొన్నాయి.
రెడ్మి కే50 గేమింగ్ సిరీస్‌లో భాగంగా రెడ్మి కే50 గేమింగ్ ఎడిషన్, రెడ్మి కే50 ప్రొ గేమింగ్ ఎడిషన్ పేరిట రెండు స్మార్ట్ఫోన్లు రానున్నాయని చెబుతున్నారు. భారత్‌లో పోకో ఎఫ్3 జీటీగా లాంఛ్ చేసిన రెడ్మి కే40 గేమింగ్ ఎడిషన్ రూ 26,999కి అందుబాటులో ఉండగా రెడ్మి కే50 గేమింగ్ ఎడిషన్‌పై ఇంకా కంపెనీ అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.