Realme Narjo N55 | 12న భారత్ మార్కెట్లోకి రియల్మీ నార్జో ఎన్55.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Realme Narjo N55 | చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ రియల్ మీ.. భారత్ మార్కెట్లోకి ఈ నెల 12న నార్జో ఎన్55 ఫోన్ ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించింది.
Realme Narjo N55 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్మీ.. భారత్ మార్కెట్లోకి నార్జో ఎన్55 ఫోన్‌ను ఈ నెల 12న తీసుకు రానున్నది. నార్జో ఎన్55 ఫోన్ ఆవిష్కరణ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు కంపెనీ సోషల్ మీడియా ప్లాట్‌పామ్స్‌పై లైవ్ ప్రసారం కానున్నది. ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ డాట్ ఇన్‌తోపాటు రియల్ మీ వెబ్సైట్లోనూ రియల్మీ నార్జో ఎన్55 ఫోన్లు లభిస్తాయి.
స్మార్ట్ ఫోన్ ప్రియులను ఆకట్టుకోవడంలో ముందు ఉన్న రియల్మీ నార్జో ఎన్55 ఫోన్ డిజైన్ మరింత ఆకర్షణీయంగానూ, అడ్వాన్స్డ్ ఫీచర్లతో అందుబాటులోకి రానున్నది. మూడు స్టోరేజీ వేరియంట్లలోనూ, రెండు కలర్స్‌లో లభించనున్నది రియల్మీ నార్జో ఎన్55.
4జీబీ రామ్ విత్ 64 జీబీ స్టోరేజీ, 6జీబీ రామ్ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, టాప్ టైర్ వేరియంట్ 8జీబీ రామ్ విత్ 128జీబీ స్టోరేజీ వేరియంట్‌ల్లో లభిస్తుంది. ప్రైమ్ బ్లాక్, ప్రైమ్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది.
రియల్మీ నార్జో ఎన్55 ఫోన్ 90హెర్ట్ రీఫ్రెష్ రేట్ అమోల్డ్ స్క్రీన్, 64-మెగా పిక్సెల్ కెమెరా విత్ 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఆప్షన్లతో వస్తున్నది. 33వాట్స్ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్‌గా ఉంటుంది. నార్జే ఎన్55 ఫోన్ ధర వెల్లడించకున్నా మిడ్ రేంజ్ రూ.15,999 నుంచి ధర ప్రారంభం అవుతుందని తెలుస్తున్నది.
గత నెలలో భారత్ మార్కెట్లోకి రియల్మీ సీ 55
గత నెలలో రియల్మీ సీ55 ఫోన్‌ను భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.10,999 నుంచి మొదలవుతుంది. ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, న్యూ మినీ క్యాప్సుల్ ఫీచర్ కలిగి ఉంది. మీడియా టెక్ జీ88 చిప్సెట్, 4000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ సపోర్ట్ ఉంటుంది. భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చిన సీ55 వేరియంట్ ఫోన్ ప్రీ-బుకింగ్స్ ఐదు గంటల్లో రికార్డు నెలకొల్పింది. 66 వేల ప్రీ-బుకింగ్స్ నమోదు చేసుకుంది. రియల్ మీ సీ సిరీస్ ఫోన్ల ప్రీ-బుకింగ్స్ లో ఇదే గరిష్టం. నెక్ట్స్ జనరేషన్, నెక్ట్స్ డిజైన్ థీమ్‌తో మార్కెట్లోకి వచ్చింది రియల్ మీ సీ55 ఫోన్.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

