POCO M7 Plus 5G 4GB | తక్కువ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే మీకోసమే పోకో ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. పోకో ఎం7 ప్లస్ 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. 4జీబీ లిమిటెడ్ ఎడిషన్ పేరిట ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. గతంలో పోకో ఎం7 ప్లస్ 5జి ఫోన్‌ను భారత్‌లో విడుదల చేయగా ఆ ఫోన్‌ను 6జీబీ, 8జీబీ ర్యామ్ మోడల్స్‌లో లాంచ్ చేశారు. ఈ క్రమంలోనే అవే ఫీచర్లతో ఇప్పుడు 4జీబీ ర్యామ్ మోడల్‌ను లాంచ్ చేశారు. ఈ ఫోన్లో 6.9 ఇంచుల ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు.
ఈ ఫోన్లో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 6ఎస్ జెన్ 3 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. 4జీబీ ర్యామ్, 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. మెమొరీని కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకునే సదుపాయం కల్పించారు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభిస్తుంది. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌ను ఇచ్చారు. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. మరో సెకండరీ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను పక్క భాగంలో ఏర్పాటు చేశారు. ఐపీ 64 డస్ట్ అండ్ స్ల్పాష్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది. 5జి సేవలను పొందవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ ఫీచర్ కూడా లభిస్తుంది.
ఈ ఫోన్లో వైఫై 6, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు సదుపాయాలను సైతం అందిస్తున్నారు. ఈ ఫోన్లో ఏకంగా 7000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇచ్చారు. 33. వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు ఇందులో సపోర్ట్ లభిస్తుంది. 18 వాట్ల రివర్స్ వైర్డ్ చార్జింగ్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఈ ఫోన్ సహాయంతో ఇతర డివైస్‌లను సైతం చార్జింగ్ చేసుకోవచ్చు.
పోకో ఎం7 ప్లస్ 5జి 4జీబీ లిమిటెడ్ ఎడిషన్‌ను పోకో ఫెస్టివ్ మ్యాడ్ నెస్ ఆఫర్ కింద ఎర్లీ యాక్సెస్‌గా అందిస్తున్నారు. ఈ ఫోన్ ను సెప్టెంబర్ 23 నుంచి విక్రయిస్తారు. ఫ్లిప్ కార్ట్‌లో మాత్రమే ప్రత్యేకంగా ఈ ఫోన్ లభ్యం కానుంది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.12,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌పై పలు బ్యాంకు ఆఫర్లను అందించనున్నారు. అందువల్ల ఫోన్‌ను రూ.10,999 ధరకు కొనుగోలు చేయవచ్చు.