న్యూఢిల్లీ : బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో భారత్ మార్కెట్లో ప్లేఫిట్ స్లిమ్2సీ స్మార్ట్‌వాచ్‌ను ప్లే మంగళవారం లాంఛ్ చేసింది. రూ 3,999 విలువైన ఈ వేరబుల్ నవంబర్ 22 నుంచి కంపెనీ అఫిషియల్ వెబ్‌సైట్‌పై అందుబాటులో ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఎంపిక చేసిన రిటైల్ అవుట్లెట్లలో ఈ డివైజ్ లభిస్తుంది.
స్మార్ట్ రిస్ట్‌వేర్ టెక్నాలజీలో మరో బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేస్తూ ప్లేఫిట్ స్లిప్2సీ స్మార్ట్‌వాచ్‌ను తమ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమని కంపెనీ వెల్లడించింది. ఫ్యాషన్ డిజైన్‌తో అడ్వాన్స్ టెక్నాలజీని జోడించి ఈ ప్రోడక్ట్‌ను తీసుకువచ్చామని తెలిపింది. ప్లేఫిట్ స్లిమ్2సీ స్మార్ట్‌వాచ్ 1.3 ఇంచ్ ఐపీఎస్ స్క్రీన్‌తో, ఫ్లాట్ సర్క్యులర్ డయల్, నేవిగేషన్ బటన్‌తో కస్టమర్ల ముందుకు వచ్చింది.
ఈ స్మార్ట్‌వాచ్ షాంపేన్, బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లపైనా పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ సాచ్యురేషన్ సెన్సర్లను కలిగిఉంది. ఒకసారి బ్యాటరీ చార్జ్ చేస్తే అయిదు రోజుల వరకూ నిరంతరాయంగా పనిచేస్తుందని ప్లే పేర్కొంది.