న్యూఢిల్లీ : ఒప్పో వాచ్ 3 సిరీస్ లాంఛ్ డేట్‌ను ఒప్పో అధికారికంగా వెల్లడించింది. ఒప్పో వాచ్ 3 చైనాలో ఆగస్ట్ 10న లాంఛ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. తర్వాతి స్మార్ట్‌వాచ్‌లు క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ డబ్ల్యూ5 జెన్ 1 చిప్‌సెట్‌ను కలిగిఉంటాయని ఒప్పో వెల్లడించింది. లాంఛ్‌కు ముందు వాచ్ 3 సిరీస్ డిజైన్ లీకయింది.
రానున్న ఒప్పో వాచ్ 3 అధికారిక ఇమేజ్‌లను టెక్ నిపుణులు ఇవాన్ బ్లాస్ షేర్ చేశారు. రెండు కలర్ ఆప్షన్స్‌లో ఇవాన్ ఒప్పో వాచ్ 3 ఇమేజ్‌లను షేర్ చేశారు. సిల్వర్, లెదర్ స్ట్రాప్ వేరియంట్‌తో పాటు ఆల్ బ్లాక్ వేరియంట్లో ఒప్పో వాచ్ 3 ఆకట్టుకుంటోంది. స్క్వేర్ షేప్ కేస్‌తో పాటు సైడ్‌లో రొటేటింగ్ బటన్ ఫీచర్ ఉంది.
ఒప్పో వాచ్ 3 కర్వ్డ్ ఎడ్జ్ డిస్ప్లేను కలిగిఉంది. ఎల్టీపీఓ టెక్నాలజీతో కూడిన 1.91 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లేను ఆఫర్ చేస్తోంది. మెటల్ బిల్ట్‌తో ఒప్పో వాచ్ 3 కస్టమర్లను ఆకట్టుకోనుంది. పవర్ఫుల్ ప్రాసెసర్‌తో పాటు ఈసీజీ టెక్నాలజీ వంటి హెల్త్ ఫీచర్లతో ఒప్పో వాచ్ 3 కస్టమర్ల ముందుకు రానుంది.