Oppo Pad SE | చాలా వరకు స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు అతి తక్కువ ధరలకే ఆకర్షణీయమైన ఫీచర్లతో ఆండ్రాయిడ్ ట్యాబ్‌లను కూడా లాంచ్ చేస్తున్నాయి. అందులో భాగంగానే ఒప్పో కూడా నూతనంగా ఓ ట్యాబ్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఒప్పో ప్యాడ్ ఎస్ఈ పేరిట లాంచ్ అయిన ఈ ఆండ్రాయిడ్ ట్యాబ్‌లో పలు ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తున్నారు. ఇందులో 11 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేయగా ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఎల్సీడీ డిస్ప్లే కనుక దృశ్యాలు చాలా క్వాలిటీగా ఉంటాయని చెప్పవచ్చు. ఒప్పో ప్యాడ్ ఎస్ఈలో మీడియాటెక్ హీలియో జి100 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది. వెనుక వైపు కూడా 5 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు.
ఈ ట్యాబ్‌లో 9340 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ లభిస్తుంది. 11 గంటల వరకు నాన్‌స్టాప్‌గా వీడియోలు చూసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ ట్యాబ్‌లో అడ్వాన్స్డ్ స్మార్ట్ పవర్ సేవింగ్ మోడ్‌ను ఏర్పాటు చేశారు. 7 రోజుల పాటు ట్యాబ్‌ను అసలు ఉపయోగించకపోయినా కూడా బ్యాటరీ డ్రాప్ అవదు. 800 రోజుల వరకు ఇంటెల్లిజెంట్ స్టాండ్ బై ఫీచర్‌ను అందిస్తున్నామని కంపెనీ తెలియజేసింది. ఈ ట్యాబ్‌ను 36 నెలల పాటు ఎలాంటి ల్యాగ్, గ్లిచ్ లేకుండా స్మూత్‌గా ఆపరేట్ చేసుకోవచ్చని కూడా కంపెనీ చెబుతోంది.
6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో ఈ ట్యాబ్‌ను లాంచ్ చేశారు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ట్యాబ్‌లో లభిస్తుంది. 4జీ, వైఫై రెండు వెర్షన్లలో ఈ ట్యాబ్‌ను అందిస్తున్నారు. 4జీ ఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి వంటి ఫీచర్లను కూడా ఈ ట్యాబ్‌లో అందిస్తున్నారు.
ఒప్పో ప్యాడ్ ఎస్ఈ ఆండ్రాయిడ్ ట్యాబ్ స్టార్‌లైట్ సిల్వర్, ట్విలైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది. ఈ ట్యాబ్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వైఫై మోడల్ ధర రూ.13,999 ఉండగా, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఎల్టీఈ మోడల్ ధర రూ.15,999గా ఉంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఎల్టీఈ మోడల్ ధర రూ.16,999గా ఉంది. ఈ ట్యాబ్‌పై లాంచింగ్ కింద రూ.1000 డిస్కౌంట్ అందిస్తున్నారు. జూలై 8వ తేదీ నుంచి ఈ ట్యాబ్‌ను ఒప్పో ఇండియా ఆన్లైన్ స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో విక్రయిస్తారు.