న్యూయార్క్ : ఇంటరాక్టివ్ చాట్‌బాట్ చాట్‌జీపీటీ (ChatGPT) లాంఛ్ చేసిన వేళ తమకు ఏఐ టూల్‌పై పెద్దగా అంచనాలు లేవని, ఇది బోరింగ్ అని, అంత మంచిగా ఉండదని అనుకున్నామని ఓపెన్ఏఐ సహ వ్యవస్ధాపకులు, ఓపెన్ఏఐ ప్రధాన శాస్త్రవేత్త ఇలా సుత్స్కేవర్ పేర్కొన్నారు. లాంఛ్‌కు ముందు చాట్‌బాట్ సామర్ధ్యాలపై తనకు ఎన్నో సందేహాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఎంఐటీ టెక్నాలజీ రివ్యూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుత్స్కేవర్ లేటెస్ట్ టెక్నాలజీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నో సంశయాలతో తాము చాట్‌జీపీటీని లాంఛ్ చేశామని గుర్తుచేసుకున్నారు. చాట్‌జీపీటీ ఆరంభంలో ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు ఇవ్వడంలో తడబడటం పట్ల తాను అసంతృప్తికి గురయ్యానని సుత్స్కేవర్ అంగీకరించారు. చాట్‌జీపీటీని లాంఛ్ చేసే సమయంలో తాము దీని సామర్ధ్యంపై సంశయాత్మకంఆ ఉన్నామని, ఇది మంచిదేనని తాము అనుకోలేదని చెప్పుకొచ్చారు. మీరు దానిని వాస్తవమైన ప్రశ్న అడిగినప్పుడు, అది మీకు తప్పుడు సమాధానం ఇచ్చింది. ఇది యూజర్లను ఆకట్టుకోలేకపోతుందని అనుకున్నానని అన్నారు.
ఇది చాలా బోరింగ్ అని ప్రజలు అంటారని భావించానని చెప్పారు. తన సందేహాలను పటాపంచలు చేస్తూ చాట్‌జీపీటీ విశేషాదరణ పొందడంతో సుత్స్కేవర్ ఆశ్చర్యపోయాడు. చాట్‌జీపీటీ ఆరంభంలో కచ్చితత్వం లేకున్నా దాని సౌకర్యమే చాట్‌బాట్ గ్రాండ్ సక్సెక్‌కు కారణంగా సుత్స్కేవర్ గుర్తించాడు. చాట్‌జీపీటీతో తొలి అనుభవాన్ని ఆయన ఆథ్యాత్మిక అనుభవంతో పోల్చాడు. చాట్‌జీపీటీ అనూహ్య విజయం టెక్ ప్రపంచంలో ఏఐ టెక్నాలజీపై హాట్ డిబేట్‌కు తెరలేపింది. లాంఛ్ అయిన రెండునెలల్లోనే చాట్‌జీపీటీ 10 కోట్ల యూజర్లను చేరుకుంది. ఏఐ ట్రెండ్‌ను అందిపుచ్చుకునేందుకు పలు టెక్ కంపెనీలు తమ సొంత ఏఐ మోడల్స్‌ను డెవపల్ చేసేందుకు బారులుతీరాయి.
Read More :