
OnePlus TV U1S: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ సరికొత్త స్మార్ట్‌టీవీని భారత్‌లో ఆవిష్కరించింది. వన్‌ప్లస్ టీవీ యూ1ఎస్ పేరుతో మూడు మోడళ్లను విడుదల చేసింది. కొత్త టీవీ 4K రిజల్యూషన్ అందిస్తుంది. 30W స్పీకర్లు, HDMI 2.0 పోర్టులు, డైనోడియో సౌండ్ వంటివి ఇందులో ఉన్నాయి. స్మార్ట్ టీవీ మూడు వేర్వేరు సైజుల్లో లభిస్తుంది.
టీవీకి కెమెరా కూడా ఉంది. దీంతో వీడియో కాల్స్ లేదా గూగుల్ వీడియో కాల్స్‌ను సులభంగా చేసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ సభ్యులు, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు. ఆర్సీసీ మెంబర్స్ ఇవాళ రాత్రి 9 గంటల నుంచి టీవీలను కొనుగోలు చేయొచ్చు. వన్‌ప్లస్ వాచ్‌తో వన్‌ప్లస్ టీవీ యు1ఎస్‌ను కూడా కంట్రోల్ చేయొచ్చు. స్మార్ట్ టీవీలో ‘స్పీక్ నౌ’ ఫీచర్ కూడా ఉంది. దీంతో టీవీని దూరం నుంచి కూడా కంట్రోల్ చేయొచ్చు.
మూడు టీవీల ధరలు:
50- అంగుళాలు: రూ.39,999
55- అంగుళాలు : రూ.47,999
65-అంగుళాలు : రూ.62,999
ICYMI
— OnePlus India (@OnePlus_IN) June 10, 2021
Follow @OnePlus_IN for more real time updates from the #OnePlusSummerLaunch Event | #OnePlusNordCE #OnePlusTVU1S pic.twitter.com/OEEfiO29Y7