OnePlus Nord CE 3 | ఆకట్టుకునే డిస్ప్లే, మెరుగైన ప్రాసెసర్‌తో రానున్న వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3..ధర ఎంతంటే..!
వన్‌ప్లస్ నార్డ్ 3తో కలిపి వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 (OnePlus Nord CE 3) జులై 5న లాంఛ్ కానుండగా లాంఛ్‌కు ముందు హాట్ డివైజ్ డిస్ప్లే, ప్రాసెసర్ స్సెసిఫికేషన్స్ను కంపెనీ వెల్లడించింది.
న్యూఢిల్లీ : వన్‌ప్లస్ నార్డ్ 3తో కలిపి వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 (OnePlus Nord CE 3) జులై 5న లాంఛ్ కానుండగా లాంఛ్‌కు ముందు హాట్ డివైజ్ డిస్ప్లే, ప్రాసెసర్ స్సెసిఫికేషన్స్ను కంపెనీ వెల్లడించింది. వన్‌ప్లస్ న్యూ నార్డ్ సీఈ 3 ఎల్సీడీ స్క్రీన్కు అప్‌గ్రేడ్‌గా 120హెచ్జడ్ అమోల్డ్ డిస్ప్లేతో కస్టమర్ల ముందుకు రానుంది. నార్డ్ సీఈ 2లో వాడిన క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ స్దానంలో అంతకంటే శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 782జీ ఎస్ఓసీ చిప్‌సెట్‌ను వాడనుంది.
నార్డ్ సీఈ3 వెనుకభాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రానుంది. నార్డ్ సీఈ 3 మెరుగై డిస్ప్లేతో పాటు మెరుగైన కలర్ ఆప్షన్స్‌లో కస్టమర్లను ఆకట్టుకోనుంది. లేటెస్ట్ చిప్సెట్తో పాటు నార్డ్ సీఈ 3 ఆక్వా సర్జ్ కలర్ ఆప్షన్‌ను కంపెనీ రివీల్ చేఇంది. ఇక వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3, నార్డ్ 3 లాంఛ్ అయిన కొద్ది రోజులకే భారత్‌లో నథింగ్ ఫోన్ (2)ను నథింగ్ లాంఛ్ చేయనుంది. ఇక నార్డ్ సీఈ 3 ఫీచర్లపై లీకుల ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ 6.72 ఇంచ్ ఫుల్హెచ్డీ+ అమోల్డ్ డిస్ప్లేను కలిగిఉంటుంది. 256జీబీ స్టోరేజ్‌తో పాటు టాప్ వేరియంట్ 12జీబీ ర్యాం వరకూ ఆఫర్ చేస్తుంది.
ఇక కెమెరా సెటప్ విషయానికి వస్తే 50 ఎంపీ సెన్సర్, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపీ మ్యాక్రో లెన్స్‌తో పాటు ప్రైమరీ కెమెరా మెరుగైన వీడియోలు, ఫొటోలను ఆఫర్ చేసే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)ను కలిగి ఉంటుంది. ఇక అండర్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, వైఫై, 5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్, చార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 80డబ్ల్యూ చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం వంటి ఫీచర్లు కస్టమర్లను ఆకట్టుకుంటాయి. ఇక వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 రూ. 25,000 నుంచి రూ 28,000 మధ్య ఉంటుందని, నార్డ్ 3 రూ. 33,000 నుంచి అందుబాటులో ఉంటుందని టెక్ నిపుణులు యోగేష్ బ్రార్ అంచనా వేశారు.
Read More :
TCS Jobs Scam | టీసీఎస్ జాబ్స్ స్కాం.. ఆరుగురు ఉద్యోగులు.. ఆరు నియామక సంస్థలపై వేటు..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

