న్యూఢిల్లీ : దేశీ మార్కెట్లో అందుబాటు ధరలో నూతన స్మార్ట్‌వాచ్‌ను నాయిస్ లాంఛ్ చేసింది. న్యూ నాయిస్ఫిట్ కోర్ 2 స్మార్ట్‌వాచ్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. ఎస్పీఓ2 మానిటర్, హార్ట్ రేట్ మానిటరింగ్ వంటి పలు హెల్త్ ఫీచర్లతో ఈ స్మార్ట్‌వాచ్ కస్టమర్ల ముందుకొచ్చింది. 1.28 ఎల్సీడీ డిస్ప్లే సహా పలు టెక్ ఫీచర్లను కలిగిఉంది. 100 క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేసెస్‌తో న్యూ నాయిస్ఫిట్ కోర్ 2 స్మార్ట్‌వాచ్ కస్టమర్లను ఆకట్టుకుంటుందని కంపెనీ తెలిపింది.
ఈ డివైజ్‌లో స్లీపింగ్, బ్రీత్ ట్రాకర్ కూడా ఉంది. నాయిస్ఫిట్ కోర్ 2 స్మార్ట్‌వాచ్ 230ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇంకా ఈ స్మార్ట్‌వాచ్‌లో రిమోట్ మ్యూజిక్, కెమెరా కంట్రోల్స్, ఫ్లాష్‌లైట్, ఫైండ్ మై ఫోన్, డు నాట్ డిస్ట్రబ్ మోడ్, వేక్ గెశ్చర్, అలారం వంటి పలు ఫీచర్లున్నాయి.
నాయిస్ఫిట్ కోర్ 2 రూ 3,999 ధర కాగా, ఆసక్తికలిగిన కస్టమర్లకు రూ 1799 తగ్గింపు ధరతో న్యూ నాయిస్ వాచ్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఈ వాచ్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. నాయిస్ఫిట్ కోర్ 2 స్మార్ట్‌వాచ్ జెట్ బ్లాక్, మిడ్నైట్ బ్లూ, సిల్వర్ గ్రే, రోజ్ పింక్, ఆలివ్ గ్రీన్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.