న్యూఢిల్లీ : ఇన్‌బిల్ట్ జీపీఎస్‌తో నాయిస్ కలర్‌ఫిట్ ప్రొ 4 జీపీఎస్ స్మార్ట్‌వాచ్‌ను నాయిస్ లాంచ్ చేసింది. వర్కవుట్ ట్రాక్ ఫీచర్ సహా లేటెస్ట్ ఫీచర్లతో న్యూ నాయిస్ స్మార్ట్‌వాచ్ కస్టమర్ల ముందుకొచ్చింది. భారత్‌లో నాయిస్ కలర్‌ఫిట్ ప్రొ 4 రూ. 2999కి అందుబాటులో ఉంది. నాయిస్ కలర్‌ఫిట్ ప్రొ 4 జీపీఎస్ స్మార్ట్‌వాచ్ చార్కోల్ బ్లాక్, డీప్ వైన్, మింట్ గ్రీన్, సిల్వర్ గ్రే, సన్‌సెట్ ఆరెంజ్, టీల్ బ్లూ, రోజ్ పింక్, మిడ్నైట్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది.
కస్టమర్లు గోనాయిస్.కాం, అమెజాన్ సైట్లలో న్యూ జీపీఎస్ స్మార్ట్‌వాచ్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇక నాయిస్ కలర్‌ఫిట్ ప్రొ 4 జీపీఎస్ 1.85 ఇంచ్ టీఎఫ్టీ డిస్ప్లేతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. వాచ్ కేసును పాలోకార్బొనేట్తో తయారుచేయగా ఇది 41.7 గ్రాముల బరువుంటుంది.
ఈ స్మార్ట్‌వాచ్ ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ను కలిగిఉంది. న్యూ కలర్‌ఫిట్ ప్రొ 4 జీపీఎస్ ఏడు రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని నాయిస్ తెలిపింది. 250ఎంఏహెచ్ పవర్ కలిగిన బ్యాటరీ రెండు గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది.