Alzheimer’s test | అల్జీమర్స్‌ను గుర్తించేందుకు మరో కొత్త రక్త పరీక్ష.. అందుబాటులోకి తెచ్చిన పరిశోధకులు
Alzheimer’s test | ఆల్జీమర్స్ వ్యాధిని గుర్తించే కొత్త రకం రక్త పరీక్షలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని లండ్ యూనివర్శిటీ, గోథెన్బర్గ్ యూనివర్శిటీ పరిశోధకులు గుర్తించారు. ఈ పరీక్షలు అందుబాటులోకి వస్తే ముందస్తు చికిత్స అందించే వీలుంటుందంటున్నారు.
Alzheimer’s test | ఆల్జీమర్స్.. మతిమరుపు కంటే భయంకరమైన వ్యాధి. ఇది నెమ్మదిగా ప్రారంభమై కాలం గడిచేకొద్దీ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఒకసారి వచ్చిందంటే మెదడుకు సమస్యే. ప్రతి క్షణం నరకంగా ఉంటుంది. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే ఈ వ్యాధి.. ప్రస్తుతం 30 నుంచి 50 ఏండ్లలోపు వారిలో కూడా వస్తున్నది. ఈ వ్యాధికి గురైన వారు ఎప్పుడు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఎదురవుతుంది.
అల్జీమర్స్ వ్యాధికి మెరుగైన చికిత్సా వ్యూహాలను కనుగొనడంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు. నాడీ సంబంధ పరిస్థితులను నిర్ధారించడంలో తొలి దశల్లో సహాయపడే పరీక్షలను కొత్త అధ్యయనం గుర్తించింది. రోగనిర్ధారణ, చికిత్సను వేగవంతం చేసేందుకు, వ్యాధి పురోగతిని తగ్గించగల సంబంధిత చికిత్స ప్రభావాలను గుర్తించడానికి సరైన మరొక రక్త పరీక్షను పరిశోధకులు కనుగొన్నారు. తేలికపాటి జ్ఞాపకశక్తి కోల్పోవడం మొదలుకొని సంభాషణలను కొనసాగించే సామర్థ్యం కోల్పోవడం వరకు ఎన్నో లక్షణాలు వీరిలో కనిపిస్తాయి.
లండ్ యూనివర్శిటీలోని ప్రొఫెసర్ ఆస్కర్ హాన్సన్, గోథెన్బర్గ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కాజ్ బ్లెనో నేతృత్వంలోని పరిశోధకుల బృందం 575 మంది రక్త పరీక్షలను విశ్లేషించి.. అల్జీమర్స్ వ్యాధి పాథాలజీని గుర్తించడంలో సరిపోయే మల్లిపుల్ బ్లడ్ బయోమార్కర్లను కనుగొన్నారు. దాదాపు 242 మందిలో కాగ్నిటివ్ టెస్టింగ్, మాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్‌తోపాటు ప్లాస్మా పరీక్షలను ఆరేండ్ల పాటు చేపట్టారు. ఈ ఆరేండ్లలో కేవలం ఫాస్ఫో-టౌ 217 మాత్రమే ఆల్జీమర్స్ వ్యాధి పాథాలజీకి సంబంధించినదని వారు కనుగొన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన విషయాలు నేచర్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

