Naya Mall | యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే వాళ్లకోసమే ఈ కెమెరా.. దీని స్పెషాలిటీ ఏంటంటే..
Naya Mall | టిక్‌టాక్ పుణ్యమాని.. సామాన్యులు కూడా సెలెబ్రిటీలుగా మారిపోయారు. ఆ చైనా యాప్‌పై నిషేధం పడినా.. యూట్యూబ్ షార్ట్స్, ఫేస్బుక్ రీల్స్‌తో హంగామా చేస్తున్నారు. వీరిలో ఎక్కువగా స్మార్ట్ఫోన్లతోనే వీడియోలు తీస్తున్నారు. ఎందుకంటే, ఖరీదైన కెమెరాలు కొనడం ఆర్థికంగా భారం.. వాటిని వాడటం కూడా కొంచెం కష్టం!
స్టార్ట్.. కెమెరా.. యాక్షన్!
టిక్‌టాక్ పుణ్యమాని.. సామాన్యులు కూడా సెలెబ్రిటీలుగా మారిపోయారు. ఆ చైనా యాప్‌పై నిషేధం పడినా.. యూట్యూబ్ షార్ట్స్, ఫేస్బుక్ రీల్స్‌తో హంగామా చేస్తున్నారు. వీరిలో ఎక్కువగా స్మార్ట్ఫోన్లతోనే వీడియోలు తీస్తున్నారు. ఎందుకంటే, ఖరీదైన కెమెరాలు కొనడం ఆర్థికంగా భారం.. వాటిని వాడటం కూడా కొంచెం కష్టం! అయితే, ఈ సమస్యకు పరిష్కారంగా కెనన్ కంపెనీ.. ఈవోఎస్ ఆర్100 పేరుతో సరికొత్త మిర్రర్‌లెస్ కెమెరాను తీసుకొచ్చింది. సామాన్యులు కూడా సులభంగా వాడగలిగేలా ఈ కెమెరా రూపొందింది. దీనివల్ల చాలా తేలికగా వీడియోలు, ఫొటోలు తీసే వీలు కలుగుతుంది. 24 మెగాపిక్సెల్ సెన్సర్ సాయంతో 4కే అల్ట్రాహెచ్‌డీ వీడియోలనూ తీయొచ్చు. ప్రొఫెషనల్ కెమెరాలకు ఏమాత్రం తీసిపోని కెనన్ ఈవోఎస్ ఆర్100 కెమెరా ధర.. రూ.49,999 నుంచి ప్రారంభం. ఆన్లైన్/ ఆఫ్‌లైన్ స్టోర్లతోపాటు in.canon వెబ్సైట్లో కొనుక్కోవచ్చు.
గో.. గ్రీన్!
ఆరోగ్య స్పృహతోపాటు పర్యావరణ చైతన్యం ఉన్నవారి కోసం అడిడాస్ ప్రత్యేక బూట్లను రూపొందించింది. భూమిపై పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించాలనే లక్ష్యంతో.. జర్మనీకి చెందిన ప్రఖ్యాత క్రీడా ఉత్పత్తుల సంస్థ నడుం బిగించింది. 50శాతం రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలతో ‘అడిడాస్ ర్యాపిడ్మూవ్ ఏడీవీ’ పేరుతో నూతన శ్రేణి బూట్లను తయారుచేసింది. ముఖ్యంగా రోజువారీ వ్యాయామాలతోపాటు క్రీడాకారులకూ ఉపయోగపడేలా.. తక్కువ బరువుతో వీటిని తీసుకొచ్చింది. పాదాలపై ఒత్తిడిని తగ్గించడానికి ఇందులో మృదువైన సోల్‌ను ఉపయోగించింది. అన్ని రకాల అవసరాలకు ఈ బూట్లు సౌకర్యవంతంగా ఉంటాయని సంస్థ చెబుతున్నది. ఆరోగ్యంతోపాటు పర్యావరణానికి మేలు చేసే ఈ అడిడాస్ బూట్ల ధర.. రూ.10,990. adidas.co.in వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు.
యాంటిక్ అద్భుతం!
అలనాటి యాంటిక్ వస్తువులు.. రాజసానికి ప్రతీకలు. నేటి మాడ్రన్ వస్తువులు.. లగ్జరీకి నెలవులు. పాతకాలపు వస్తువులు ఇంటికి కొత్త అందాన్ని తీసుకొచ్చినా.. అంత సౌకర్యంగా ఉండవు. కొత్త వస్తువులు సౌకర్యంగానే ఉన్నప్పటికీ.. అందరి ఇళ్లలోనూ కనిపిస్తూనే ఉంటాయి. ఈ లోటును భర్తీ చేసేలా.. ప్రముఖ డిజైనర్ శివం దేవన్ పాతకొత్తల కలయికలో ‘పారాలుమ్ గోల్డ్ ల్యాంప్’ను రూపొందించారు. రోశా ఇండియా తయారు చేసిన ఈ మాడ్రన్ యాంటిక్ ల్యాంప్.. మీ ఇంటికి రాయల్ లుక్ తీసుకొస్తుంది. లగ్జరీగా కనిపిస్తూనే.. మదిలోని పాత జ్ఞాపకాలను తట్టిలేపుతుంది. అల్యూమినియంతో చేయడం వల్ల తక్కువ బరువువో, ఎక్కువ మన్నిక ఇస్తుంది. ఈ వైర్‌లైస్ ల్యాంప్‌ను ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. సాయంత్రం డైనింగ్ టేబుల్ మీదికి చేరిస్తే.. క్యాండిల్ లైట్ డిన్నర్ ఆస్వాదించవచ్చు. రాత్రి పూట పడక పక్కన పెట్టుకొని, బెడ్ల్యాంప్గానూ వాడుకోవచ్చు. ఇందులోని ఎల్ఈడీ లైట్లు 3000 కెల్విన్ వరకూ వెలుగులు పంచుతాయి. వీటిని మన సౌకర్యానికి తగ్గట్టుగా మార్చుకోవచ్చు కూడా! ఈ ల్యాంప్‌లో 2900 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే.. 12 గంటల వరకూ పనిచేస్తుంది. గోల్డ్, రోజ్‌గోల్డ్, రాగి, నలుపు, తెలుపు రంగుల్లో లభ్యమయ్యే ఈ ల్యాంప్ ధర రూ.5,999. roshaindia.com వెబ్సైట్లో దొరుకుతుంది.
బ్యాటరీ.. నో వర్రీ
నూటికి నూరుపాళ్లు దేశీయ సంస్థ.. ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ యూ అండ్ ఐ ఇటీవల రెండు కొత్త పవర్ బ్యాంకులను మార్కెట్లో విడుదల చేసింది. ఎక్సెల్ సిరీస్‌లో భాగంగా 10000 ఎంఏహెచ్ సామర్థ్యంతో వీటిని తీసుకొచ్చింది. ఇందులో ఉపయోగించిన 22.5 వాట్స్ పవర్ అవుట్‌పుట్ ద్వారా.. నిమిషాల్లోనే మీ ఫోన్‌ను 100శాతం చార్జ్ చేసేస్తుంది. యూఎస్బీ – సీ, యూఎస్బీ – సీ లైటెనింగ్ కేబుల్‌తో వస్తున్న ఈ పవర్‌బ్యాంక్‌తో ఆపిల్, ఆండ్రాయిడ్ ఫోన్లను చార్జ్ చేసుకోవచ్చు. దీని పైభాగంలో ఎల్ఈడీ డిస్ప్లే అమర్చారు. అందులో ఇంకా ఎంత పవర్ బ్యాకప్ ఉన్నదో ఎప్పటికప్పుడు చూపిస్తుంది. తక్కువ బరువు, ఎక్కువ సామర్థ్యంతో వస్తున్న యూఅండ్ఐ ఎక్సెల్ పవర్ బ్యాంక్ ఖరీదు.. రూ.2,999. అన్ని ఆన్లైన్/ ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ లభిస్తుంది.
Read More :
Naya Mall | ఫెరారీ నుంచి అదిరిపోయే బ్లూటూత్ స్పీకర్.. దీని ప్రత్యేకతలు ఏంటంటే..
Naya Mall | ఈ గడియారం చాలా వెరైటీ.. చిన్న ముల్లు సగం తిరిగాక రివర్స్ వచ్చేస్తుంది!
Naya Mall | ఈ కెమెరాలతో ఎంతటి వర్షంలోనైనా అందమైన ఫొటోలు తీయొచ్చు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం




