బబుల్‌లో భారీ నక్షత్రం.. హబుల్ తీసిన స్టన్నింగ్ ఫొటో చూశారా?

వాషింగ్టన్: హబుల్ టెలిస్కోప్.. మూడు దశాబ్దాలుగా ఈ అనంత విశ్వంలో దాగి ఉన్న అద్భుతమైన రహస్యాలను ఫొటోలు తీస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంది. అయితే కొన్ని రోజులుగా సాంకేతిక కారణాలతో పని చేయని ఈ టెలిస్కోప్.. మళ్లీ తన కెమెరాకు పని పెట్టింది. ఈ సందర్భంగా నాసా ఓ స్టన్నింగ్ ఫొటోను షేర్ చేసింది. 2016లో ఈ హబుల్ టెలిస్కోప్ మన పాలపుంతలోనే తీసిన ఫొటో ఇది. ఓ బబుల్‌లో భారీ నక్షత్రం చిక్కుకోవడం ఇందులో చూడొచ్చు.
తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో హబుల్ టెలిస్కోప్‌కు ఎదురైన సాంకేతిక సమస్యలను నాసా వివరించింది. ఆ తర్వాత ఈ బబుల్‌లో చిక్కుకున్న నక్షత్రం గురించి చెప్పింది. ఇది మన సూర్యుడి కంటే కూడా 10 లక్షల రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా మండుతోందని, దీనివల్ల ఎంతో శక్తివంతమైన వాయువులు.. గంటలకు 40 లక్షల మైళ్ల వేగంతో బయటకు వస్తున్నట్లు నాసా వివరించింది. ఇది కోటి నుంచి రెండు కోట్ల సంవత్సరాల్లో పేలనుందని అంచనా వేసింది. ఈ ఫొటోను షేర్ చేసిన ఒక రోజులోపే కొన్ని లక్షల సంఖ్యలో లైక్స్ వచ్చాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

