వాషింగ్టన్: సౌర కుటుంబంలో భూమి తర్వాత అరుణ గ్రహాన్ని తన నివాసం చేసుకోవాలని చూస్తున్నాడు మనిషి. ఆ దిశ ఇప్పటికే చాలా దేశాలు మార్స్‌పై ప్రయోగాలు చేస్తున్నాయి. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ( NASA ) ఇప్పటికే పలు రోవర్లను మార్స్‌పైకి పంపించింది. భవిష్యత్తులో తమ ఆస్ట్రోనాట్లను కూడా కుజుడి మీదికి పంపాలని చూస్తోంది. దీనికోసం ఏకంగా మార్స్ వాతావరణాన్నే భూమిపై సృష్టించింది. అంతేకాదు ఇప్పుడిందులో ఉండటానికి ఆసక్తి చూపే వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చనీ చెప్పింది.
ఎక్కడ ఉంది?
ఓ 3డీ-ప్రింటర్ సాయంతో మార్స్‌పై వాతావరణాన్ని ఇక్కడ సృష్టించింది నాసా. దీనిపేరు మార్స్ డూన్ ఆల్ఫా. 1700 చదరపు అడుగుల ఈ ప్రాంతం.. హూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్ బిల్డింగ్‌లో ఉంది. ఈ మార్షన్ వాతావరణంలో ఏడాది కాలం ఉండటానికి ఎవరైనా ఆసక్తిగా ఉంటే అప్లై చేసుకోవచ్చని తన ట్విటర్లో నాసా వెల్లడించింది. భవిష్యత్తు మిషన్లలో ఎదురయ్యే నిజ జీవిత సవాళ్లను ఎదుర్కోవడంలో భాగంగా ఈ ప్రయత్నం చేస్తున్నాం. దీర్ఘకాలం మార్స్ వాతావరణంలో ఉండే వ్యక్తులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారన్నదానిపై నాసా అధ్యయనం చేస్తుందని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
అచ్చూ మార్స్ పరిస్థితులే..
ఈ మార్స్ డూన్ ఆల్ఫాలో అచ్చూ మార్స్‌పై ఉండే పరిస్థితులకే సృష్టించారు. పరిమిత సంఖ్యలో వనరులు, పరికరాల వైఫల్యం, కమ్యూనికేషన్ ఆలస్యం కావడం, ఇతర పర్యావరణ సంబంధమైన సవాళ్లు అన్నీ ఇందులో ఉన్నాయి. ఇందులో ఉండేవాళ్లు స్పేస్‌వాక్‌లు చేయడం, సైంటిఫిక్ రీసెర్చ్‌లు, వర్చువల్ రియాల్టీని ఉపయోగించడం, రోబోటిక్ నియంత్రణలు వంటివి చేయాల్సి ఉంటుంది. మార్స్‌పై ఎదురయ్యే నిజమైన సవాళ్లను అధిగమించడానికి ఈ ప్రయోగం ముఖ్యమైన డేటాను అందిస్తుందని నాసా భావిస్తోంది.
దరఖాస్తుకు ఎవరు అర్హులు?
కేవలం అమెరికా పౌరులు లేదా అక్కడ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్న 30 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడటం, మంచి శారీరక ఆరోగ్యం, పొగతాగే అలవాటు లేకపోవడం కూడా అర్హతల జాబితాలో ఉన్నాయి. ఇంజినీరింగ్, మ్యాథెమెటిక్స్, లేదా బయోలాజికల్, ఫిజికల్, లేదా కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ తప్పనిసరి.
Calling all Martians! @NASA is recruiting four crew members for a year-long mission that will simulate life on a distant world, living in “Mars Dune Alpha,” a 3D-printed habitat. Want to take part in research for the first human Mars mission?
— NASA Mars (@NASAMars) August 6, 2021
Learn more! https://t.co/v3dL7qzRk9 pic.twitter.com/k5sviRXvtV