న్యూఢిల్లీ : మోటోరోలా తన తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంఛ్ చేసేందుకు సన్నద్ధమైంది. లేటెస్ట్ కెమెరా ఫీచర్లతో మోటో ఎక్స్ 30ప్రొ లాంచ్‌కు కసరత్తు సాగిస్తోంది. తొలుత చైనా మార్కెట్లో మోటో ఎక్స్30 గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేలా మోటోరోలా ప్రణాళికలు రూపొందిస్తోంది. రానున్న స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్లపై లెనోవా ఎగ్జిక్యూటివ్ కీలక వివరాలు వెల్లడించారు.
మోటో ఎక్స్30 ప్రైమరీ కెమెరా 1/1.22 ఇంచ్ సెన్సర్‌తో ముందుకు రానుందని లెనోవా మొబైల్ చైనా జనరల్ మేనేజర్ చెన్ జిన్ వీబోలో పోస్ట్ చేశారు. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ 125డబ్ల్యూ ఫాస్ట్చార్జర్తో పాటు, 200 మెగాపిక్సెల్ కెమెరా, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 చిప్సెట్ వంటి ప్రత్యేకతలను కలిగిఉంటుందని భావిస్తున్నారు.
ఇక హాట్ కెమెరా ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్ 50 మెగాపిక్సెల్ సెన్సర్, 12 మెగాపిక్సెల్ సెన్సర్‌తో పాటు ముందు భాగంలో సెల్ఫీల కోసం 60 మెగాపిక్సెల్ కెమెరాతో కస్టమర్లను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.