Sputnik Light : స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ ఎగుమతికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్
Sputnik Light : భారతదేశంలో తయారవుతున్న రష్యన్ స్పుత్నిక్ లైట్ కొవిడ్-19 వ్యాక్సిన్‌ను ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది....

న్యూఢిల్లీ : (Sputnik Light) భారతదేశంలో తయారవుతున్న రష్యన్ స్పుత్నిక్ లైట్ కొవిడ్-19 వ్యాక్సిన్‌ను ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌ను భారతదేశంలో అత్యవసర వినియోగానికి ఇంకా ఆమోదించలేదు. దాంతో ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి భారత ప్రభుత్వం ఆదివారం అనుమతి ఇచ్చింది. రష్యాకు 40 లక్షల డోసుల స్పుత్నిక్ లైట్‌ను ఎగుమతి చేయడానికి భారత్‌కు చెందిన ఔషధ సంస్థ హెటెరో బయోఫార్మా లిమిటెడ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
స్పుత్నిక్ లైట్ అనేది రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ V కాంపోనెంట్-1 వలె ఉంటుంది. ఇది ఏప్రిల్‌లో భారతదేశం ఔషధ నియంత్రణ విభాగం నుంచి అత్యవసర వినియోగ అధికారాన్ని పొందింది. దాంతో భారతదేశంలోని యాంటీ-కోవిడ్ టీకాల్లో ఈ టీకాను కూడా చేర్చారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) భాగస్వాములలో ఒకరైన హెటెరో బయోఫార్మా ఉత్పత్తి చేసే స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌కు ఇక్కడ అత్యవసర వినియోగానికి అనుమతి వచ్చే వరకు తమ దేశానికి ఎగుమతి చేయడానికి అనుమతించాలని రష్యన్ రాయబారి భారత ఔషధ నియంత్రణ కార్యాలయం ద్వారా భారత ప్రభుత్వాన్ని కోరారు.
స్పుత్నిక్ V మిలియన్ డోసులు, స్పుత్నిక్ లైట్ రెండు మిలియన్ డోసులను హెటెరో బయోఫార్మా లిమిటెడ్ ఇప్పటికే ఉత్పత్తి చేసిందని కేంద్రానికి పంపిన లేఖలో రష్యన్ రాయబారి నికోలాయ్ కుడాషెవ్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఆరు నెలల షెల్ఫ్ జీవితం త్వరలో ముగుస్తున్నదని, రిజిస్ట్రేషన్‌కు ముందు టీకా మోతాదులు వృథా అవుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
రష్యాకు 40 లక్షల మోతాదుల స్పుత్నిక్ లైట్‌ను ఎగుమతి చేయడానికి హెటెరో బయోఫార్మాకు ప్రభుత్వం అనుమతించినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
మళ్లీ ప్రమాదకరంగా మారిన ఢిల్లీ గాలి నాణ్యత
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన టయోటా మిరై
జమ్ముకశ్మీర్‌లో 16 చోట్ల ఎన్ఐఏ దాడులు
2036 లో ఇండియాలో ఒలింపిక్స్..!
ఆసియాలో తొలిసారి ఒలింపిక్స్ నిర్వహణ ఇక్కడే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

