Today History : ఆసియాలో తొలిసారి ఒలింపిక్స్ నిర్వహణ ఇక్కడే..!
Today History : ఆసియాలోని ఒక దేశంలో తొలిసారి ఒలింపిక్ క్రీడలను 1964 లో సరిగ్గా ఇదే రోజున నిర్వహించారు. ఈ ఒలింపిక్స్‌లో పాకిస్తాన్‌ను...

(Today History) ఆసియాలోని ఒక దేశంలో తొలిసారి ఒలింపిక్ క్రీడలను 1964 లో సరిగ్గా ఇదే రోజున నిర్వహించారు. ఈ ఒలింపిక్స్‌లో పాకిస్తాన్‌ను ఓడించిన భారత్.. హాకీలో స్వర్ణ పతకాన్ని ఒడిసిపట్టుకున్నది. ఒలింపిక్ క్రీడలు 1964 లో జపాన్ రాజధాని టోక్యోలో ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలు అక్టోబర్ 24 న ముగిశాయి. వాస్తవానికి టోక్యోలో ఒలింపిక్ క్రీడలు 1940 లో నిర్వహించేందుకు ఎంపిక చేశారు. అయితే, జపాన్‌పై చైనా దాడి చేసిన కారణంగా హెల్సెంకికి మార్చారు. కాగా, 1940, 1944 లలో మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ఒలింపిక్ క్రీడలు నిర్వహించలేదు.
టోక్యో ఒలింపిక్స్‌లో హిరోషిమాలో జన్మించిన యోషినోరి సకాయ్ క్రీడల జ్యోతిని వెలిగించాడు. టోక్యో ఒలింపిక్స్ అమెరికా, ఐరోపాలో శాటిలైట్ ద్వారా ప్రసారం చేసిన మొదటి ఒలింపిక్స్‌గా చరిత్రలో నిలిచిపోయాయి. వర్ణవివక్ష విధానాల కారణంగా దక్షిణాఫ్రికాను ఈ క్రీడల నుంచి మినహాయించారు. 15 రోజుల పాటు జరిగిన ఈ క్రీడల్లో 93 దేశాలకు చెందిన 5,151 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. జూడో, వాలీబాల్‌తో పాటు 20 క్రీడల్లో 163 ఈవెంట్లు నిర్వహించారు.
ఈ క్రీడల్లో సోవియట్ యూనియన్ 96 పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా 90, జర్మనీ 50 పతకాలతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. హాకీలో భారత్‌కు ఒకే ఒక్క పతకం స్వర్ణ పతకం వచ్చింది. హాకీ ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి 1960 రోమ్ ఒలింపిక్స్‌కు భారతదేశం ప్రతీకారం తీర్చుకున్నది.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2015: టర్కీలోని అంకారాలో శాంతి ర్యాలీలో బాంబు దాడి, దాదాపు 95 మంది దుర్మరణం
2014 : కైలాస్ సత్యార్థి, మలాలా యూసుఫ్జాయ్కి నోబెల్ శాంతి బహుమతి ప్రకటన
2010: ప్రముఖ గజల్ గాయకుడు జగ్జిత్ సింగ్ ముంబైలో మరణం
2005: జర్మనీకి మొదటి మహిళా ఛాన్సలర్‌గా ఎంపికైన ఏంజెలా మెర్కెల్
1978: జాతీయ చెస్ పోటీలో గెలుపొందిన మొదటి మహిళగా నిలిచిన రోహిణి ఖాదిల్కర్
1970: బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన ఫిజిఽ
1967: అమలులోకి బాహ్య అంతరిక్ష ఒప్పందం
1954: ప్రముఖ భారతీయ సినీ నటి రేఖ జననం
1910: వారణాసిలో మొదటి అఖిల భారత హిందీ సమావేశం
ఇవి కూడా చదవండి..
తెలంగాణ చీఫ్ జస్టిస్‌గా సతీష్ చంద్ర శర్మ.. రాష్ట్రపతి ఆమోదం
చైనా తయారీ టెస్లా కార్లు ఇక్కడ అమ్మొద్దు : నితిన్ గడ్కరీ
కోహ్లీ, రోహిత్ కన్నా ఈ ఆటగాడికి సామర్ధ్యం ఎక్కువ : గంభీర్ వ్యాఖ్య
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

