NIA raids : జమ్ముకశ్మీర్‌లో 16 చోట్ల ఎన్ఐఏ దాడులు
NIA raids : జమ్ముకశ్మీర్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ముమ్మరంగా దాడులు జరుపుతున్నది. ఆదివారం జమ్ముకశ్మీర్‌లోని 16 ప్రాంతాల్లో...

శ్రీనగర్ : (NIA raids) జమ్ముకశ్మీర్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ముమ్మరంగా దాడులు జరుపుతున్నది. ఆదివారం జమ్ముకశ్మీర్‌లోని 16 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు జరిపింది. ‘వాయిస్ ఆఫ్ హింద్’ ప్రచురణ సంస్థ కార్యాలయాలు, ఐఈడీల రికవరీకి సంబంధించి ఈ దాడులు జరిపినట్లు తెలుస్తున్నది. జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్, అనంతనాగ్, కుల్గామ్, బారాముల్లాలోని 9 ప్రదేశాల్లో దాడులు చేసింది. హసన్ రోడ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో డ్రైవర్ అయిన నయీమ్ అహ్మద్ భట్, నంద్ సింగ్ చత్తబాల్‌లోని ముస్తాక్ అహ్మద్ దార్ ఇంటిపై కూడా దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానితుల నుంచి ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
వాయిస్ ఆఫ్ హింద్ అనే ఆన్లైన్ మంథ్లీ మ్యాగజైన్ యాజమాన్యం పత్రికల ద్వారా లోయలోని ముస్లిం యువకులను ఉగ్రవాదం వైపు వచ్చేలా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది జూలై 11 న జమ్ముకశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. ఈ సమయంలో ముగ్గురు నిందితులు ఉమర్ నిసార్, తన్వీర్ అహ్మద్ భట్, రమీజ్ అహ్మద్ లోన్లను అరెస్టు చేశారు. వీరు అనంతనాగ్ జిల్లాలోని అచబల్ ప్రాంత నివాసితులు. కర్ణాటకలోని భత్కల్‌లో రెండు చోట్ల దాడులు చేసింది. ప్రధాన నిందితుడైన జుఫ్రీ జవహర్ దముడిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నది. పౌరులపై ఉగ్రవాద దాడుల తర్వాత జమ్ముకశ్మీర్ పోలీసులు గత ఒక్క వారంలోనే లోయ నుంచి 570 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
2036 లో ఇండియాలో ఒలింపిక్స్..!
ఆసియాలో తొలిసారి ఒలింపిక్స్ నిర్వహణ ఇక్కడే..!
తెలంగాణ చీఫ్ జస్టిస్‌గా సతీష్ చంద్ర శర్మ.. రాష్ట్రపతి ఆమోదం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

